Thegimpu Review: తెగింపు సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అజిత్ (Hero)
  • మంజు వారియర్ (Heroine)
  • సముద్రఖని తదితరులు.. (Cast)
  • హెచ్.వినోద్ (Director)
  • బోణీకపూర్ (Producer)
  • జిబ్రాన్ (Music)
  • నిరవ్ షా (Cinematography)
  • Release Date : బేవాచ్ ప్రొజెక్ట్స్ - జీ స్టూడియోస్

తమిళ స్టార్ కథానాయకుడు అజిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా యాక్షన్ ఎంటర్ టైనర్ “తునివు”. ఆ చిత్రాన్ని “తెగింపు” అనే పేరుతో అనువాదరూపంలో తెలుగులో విడుదల చేశారు. “నేర్కొండ పరవాయ్, వలిమై” అనంతరం హెచ్.వినోద్-అజిత్ ల కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. మరి ఈ సినిమాతో అజిత్ విజయం సాధించగలిగాడో లేదో చూద్దాం..!!

కథ: వైజాగ్ లోని “యువర్ బ్యాంక్”లోకి దొంగలు చొరబడతారు. బ్యాంక్ లో ఉన్న 500 కోట్ల రూపాయల ఓవర్ లోడెడ్ మనీని దొంగతనం చేయడమే ధ్యేయంగా మొదలైన దొంగతనంలోకి డార్క్ డెవిల్ (అజిత్) ఎంటరావుతాడు. అప్పటివరకూ 500 కోట్ల కోసమే దొంగతనం జరుగుతుందని భావించిన వారందరికీ.. అసలు దొంగతనం 25000 కోట్ల రూపాల దొంగతనం అని తెలిసేసరికి షాక్ కి గురవుతారు.

అసలు 25000 కోట్లు ఒక బ్యాంక్ లోకి ఎందుకొచ్చాయి? ఆ విషయం డార్క్ డెవిల్ కి ఎలా తెలిసింది? ఈ దొంగతనం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “తెగింపు” చిత్రం.

నటీనటుల పనితీరు: యాంటీ హీరో రోల్లో అజిత్ ఏ స్థాయిలో అలరించగలడో “గ్యాంబ్లర్” ఆల్రెడీ ఒకసారి చూపించింది. “తెగింపు”లోనూ పాత్ర అదే స్థాయిలో మొదలైనప్పటికీ.. కీలకమైన బ్యాక్ స్టోరీ & జస్టిఫికేషన్ మిస్ అవ్వడంతో సగం ఉడికిన దిబ్బ రొట్టెలా మిగిలిపోయింది. మంజు వారియర్ కొన్ని సన్నివేశాలకు పరిమితం అయిపోయింది.

అలాగే సముద్రఖని పాత్రకు కూడా సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు. అందువల్ల.. ఎవరి పాత్రలు కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేక చతికిల పడతాయి. అజయ్ నెగిటివ్ రోల్లో ఆకట్టుకున్నాడు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమా మొదలైనప్పట్నుంచి కంటెంట్ తో సంబంధం లేకుండా తమ బెస్ట్ ఇచ్చినవాళ్లు ఇద్దరు. ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్, మరొకరు సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా. ఇద్దరి వర్క్ శభాష్ అనేలా ఉంది. జిబ్రాన్ ట్రెండీ బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. అలాగే నిరవ్ షా కొన్ని యాక్షన్ బ్లాక్స్ ను కంపోజ్ చేసిన విధానం కూడా బాగుంది.

దర్శకుడు హెచ్.వినోద్ కు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. “సతురంగ వేట్టై, ఖాకీ” చిత్రాలతో అతడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఆఖరికి “పింక్” తమిళ రీమేక్ నేర్కొండ పరవాయ్ కి కూడా తనదైన మాస్ టచ్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అలాంటి హెచ్.వినోద్ “వలిమై”తో ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆ సినిమాలో మదర్ సెంటిమెంట్ కి అందరూ షాక్ అయ్యారు. కట్ చేస్తే.. ముచ్చటగా అజిత్ తో మూడో సినిమా ఒకే చేయించుకొని అందరినీ మరోసారి షాక్ కు గురి చేశాడు.

సర్లే ఈసారైనా వినోద్ మార్క్ సినిమా చూసే అవకాశం దక్కుతుంది అనుకున్నవాళ్లందరికీ మరింత పెద్ద షాక్ ఇచ్చాడు వినోద్. చాలా చక్కగా మొదలైన “తెగింపు” సినిమా.. ఇంటర్వెల్ బ్లాక్ కి వచ్చేసరికే నీరసం వచ్చేస్తుంది. ఇక అజిత్ ఎందుకు బ్యాంక్ దొంగతనానికి పూనుకుంటాడు అనేందుకు ఇచ్చిన జస్టిఫికేషన్ & ఫ్లాష్ బ్యాక్ సినిమాకి మెయిన్ మైనస్ గా మారింది.

కథకుడిగా, దర్శకుడిగా వినోద్ మరోసారి విఫలమయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ మొత్తాన్ని “వైస్ సిటీ” గేమ్ నుంచి స్పూర్తి పొంది కంపోజ్ చేసిన విధానం హాస్యాస్పదంగా ఉంటుంది. వినోద్ లాంటి దర్శకుడి నుంచి అసలు ఏమాత్రం ఎక్స్ పెక్ట్ చేయని క్లైమాక్స్ & సినిమా ఇది.




విశ్లేషణ: మనీ హెయిస్ట్ రేంజ్ లో సినిమా తీద్దామనుకొని.. చాలా సిల్లీగా, ఎలాంటి ఎమోషనల్ కనెక్టివిటీ లేకుండా ముగించేసిన యాక్షన్ డ్రామా “తెగింపు”. అజిత్ వీరాభిమానులు మినహా మిగతా ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసి ఆస్వాదించడం కష్టమే.

రేటింగ్: 1.5/5

Click Here To Read in ENGLISH



Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus