ఒకప్పుడు అల్లు అర్జున్ సరసన నటించి వెండితెరకు పరిచయమైన హీరోయిన్లు తెలుగులో రాణించిన సందర్భాలు చాలా అరుదు. “గంగోత్రి”లో హీరోయిన్ గా పరిచయమైన అదితి అగర్వాల్, ఆర్యతో హీరోయిన్ గా పరిచయమైన అను మెహతా, “బన్నీ”తో చిందులేసిన గౌరీ ముంజల్, “వరుడు”తో స్క్రీన్ షేర్ చేసుకున్న భానుశ్రీ మెహ్రా వంటి వారు ఎవరూ తెలుగులో పెద్దగా రాణించలేకపోయారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన నటించిన హీరోయిన్ల పరిస్థితి కూడా అలానే తయారయ్యింది.
తెలుగమ్మాయి అయిన రీతువర్మకు “పెళ్ళిచూపులు” లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ హిట్ తర్వాత తెలుగు నుంచి సరైన అవకాశం ఒక్కటీ రాలేదు. “అర్జున్ రెడ్డి” లాంటి సెన్సేషనల్ హిట్ లో నటించిన షాలిని పాండే పరిస్థితి కూడా అంతే. ఆమె కూడా ఎందుకో తెలుగులో మాత్రం పెద్దగా రాణించలేకపోయింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయ్యే అవకాశాలు మాత్రం కాస్త గట్టిగానే కనిపిస్తున్నాయి. ఇక “ట్యాక్సీవాలా” హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె హీరోయిన్ గా సెకండ్ ఛాన్స్ సంపాదించుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడిందో అందరికీ తెలిసిందే. మరి అప్పట్లో అంటే అల్లు అర్జున్ తన హీరోయిన్స్ కు ఎలాంటి సహాయం అందించలేకపోయాడు.. కనీసం విజయ్ అయినా వారికి రెండో ఛాన్స్ ఇవ్వొచ్చు కదా అని వాదనలు వినిపించాయి.