Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

  • April 14, 2026 / 10:27 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ‘తెరచాప’ (Therachaapa). జోయల్ జార్జ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించగా రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. రాజు బొడసింగి ఎడిటింగ్ చేయగా జీవన్ జార్జ్ కోరియోగ్రఫీ చేశారు. ప్రమోషన్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం అట్టహాసంగా ప్రీ రిలీజ్ వేడుక చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు, అతిధులకు, ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. నిర్మాత కైలాష్ గారు ఎంతో కష్టపడి తన సొంతదైన డబ్బును మా పై, జార్జ్ పై, అలాగే నవీన్ పై ఉన్న నమ్మకంతో సినిమా చేశారు. ఈ సినిమాలో నాతోపాటు ఎందరో సీనియర్ నటులు నటించారు. అలాగే కొత్త వారు కూడా నటించారు. మండుట ఎండలో సముద్ర తీరాన ఇసకలో చెప్పులు లేకుండా నటించడం అనేది ఎంతో కష్టమైన పరిస్థితి. అటువంటి పరిస్థితులలో కూడా నవీన్ రాజ్ చాలా కష్టపడి నటించారు. శారీరకంగానే కాకుండా మానసిక ఒత్తుడులు ఎన్ని ఉన్నా కూడా ఆయన వాటిని ఎదిరించి నిలబడ్డారు. అంత కష్టపడి నటించినా ఈ సినిమాను తన తండ్రికి అంకితం చేస్తున్నాను అని నాతో అన్నప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను. ఇటువంటి ఇవ్వాలని ప్రేక్షకులంతా ఎంకరేజ్ చేసి ఈ సినిమాను గణ విజయం చేస్తారని నమ్ముతున్నాను” అన్నారు.

30 ఇయర్స్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ… “నేను ఇప్పటికీ ఎన్నో చిత్రంలో నటించినప్పటికీ ఈ సినిమా నాకు ప్రత్యేకమైనది. ఈ చిత్ర బంధం అంతా కలిసి ఎంతో కష్టపడి సముద్ర తీరాన మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ప్రజలందరికీ తెలిసే విధంగా చేశారు. నా కూతురు శ్రీలు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించడం అలాగే నేను ఆ సినిమాలో భాగం కావడం నాకు ఈ సినిమా పట్ల మరింత ప్రత్యేకతను పెంచింది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు నాగ మహేష్ మాట్లాడుతూ… “ఈ సినిమాలో నా పాత్ర కాస్త ప్రత్యేకమైనది. ఇప్పటివరకు ఒక విధంగా చూసిన నన్ను ఈ సినిమాలో మరొక విధంగా చూడబోతున్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినప్పుడు ఎంతో ఎమోషనల్ గా నవీన్ ఫీలయ్యారు. సినిమా మంచి విజయం సాధించాలని, అందరూ దానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను” అన్నారు.

పుష్ప జగదీష్ మాట్లాడుతూ… “నవీన్ తో నాకు ఇప్పటినుండో స్నేహబంధం ఉంది. ఆ స్నేహం వల్ల నేను ఈ చిత్రంలో నటించిన కాదు, ఈ సినిమాలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉంది కాబట్టి నటించాను. ఈ సినిమా కోసం చిత్ర బంధం అంతా ఎంతో కష్టపడి పని చేశారు. సినిమా బాగా ప్రేక్షకుల అభినందనలు పొందాలని కోరుకుంటున్నాను” అన్నారు.

రామ్కీ మాట్లాడుతూ… “ఈ చిత్రానికి ఎంత కష్టపడ్డారు ఇప్పటికే నాకు అర్థమైంది. సినిమా కోసం ఛాంబర్ నుండి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా నేను అందుబాటులో ఉండి చేస్తాను. అలాగే సినిమా మంచి హిట్ కావాలని కోరుతున్నాను” అన్నారు.

దర్శకుడు సముద్ర గారు మాట్లాడుతూ… “సముద్రతీతంగా అటువంటి పరిస్థితులలో ఒక సినిమా తీయడం అనేది ఎంతో కష్టమైన విషయం. అటువంటి సినిమాను ఈ చిత్రం బృందం అంతా కలిసి ఎంతో పట్టుదలతో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందరూ వీరిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత కైలాష్ దుర్గం మాట్లాడుతూ… “నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. కేవలం కథ నచ్చి ఈ సినిమా చేశాను. ఒక సినిమా చేయాలి అంటే నిర్మాతకు చాలా బలమైన సంకల్పంతో పాటు కుటుంబ బలం కూడా ఉండాలి. నాకు అలా బలంగా నిలబడిన నా కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా సినిమాను ప్రేక్షకులంతా ఆదరించి, ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు.

దర్శకుడు జార్జ్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నాకోసం ఎంతో కష్టపడి మా సినిమాలో ప్రేక్షకులు మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ముందుగా ఈ సినిమా గురించి థాంక్స్ చెప్పుకోవాల్సింది మా నిర్మాతకు. మా చిత్ర బంధం అంతా కలిసి ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాను. సీనియర్ నటులు అందరూ మాకు ఎంతో సహకరించారు. సినిమాకు మంచి ప్రేక్షకుల ఆదరణ కలగాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటి శ్రీలు మాట్లాడుతూ… “సినిమాలో నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. సముద్ర తీరాన అక్కడ ఉండే మత్స్యకారుల జీవన శైలిలో నటించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అన్నారు.

నటి పూజా సుహాసిని మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నాకు ఈ చిత్రంలో హీరోయిన్గా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా కోసం మేము ఎంతో కష్టపడి సముద్ర తీరాన మొన్నటి ఎండలో పనిచేశాము. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరూ మా సినిమాకు మంచి హిట్ అందించండి” అన్నారు.

హీరో నవీన్‌రాజ్ శంకరాపు మాట్లాడుతూ… ” అందరికీ నమస్కారం. నాకు ఈ తెరచాప సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమా కోసం మేము సముద్ర తీరాన ఎన్నో రోజులు ఎంతో కష్టపడి అక్కడ బ్రతికే మత్స్యకారుల జీవితాలను అర్థం చేసుకొని వారిలో ఒకరిగా కలిసిపోయి చిత్రీకరించాము. ఎంతోమంది ఎన్నో కలలు కని సినిమా తీసినట్లే మేము కూడా చేశాము. మా సినిమాను ప్రేక్షకులు అంతా ఆదరించి మంచి విజయం సాధించేందుకు తోడ్పడుతారని కోరుకుంటున్నాను. ఈ సినిమా మా నాన్నగారికి అంకితం చేస్తున్నాను. నేను ఎప్పుడు సినిమా చేసినా కూడా ఇలాగే ఎక్కువమంది ఆర్టిస్టులతో కలిసి పని చేసేందుకు ఇష్టపడతాను. ఆ విధంగా ఎక్కువ మందితో పనిచేయవచ్చు అలాగే ఇంకో మందికి నా ద్వారా చిన్న సహాయం అందుతుందని ఆశ. ఈ నెల 17వ తేదీన మీ ముందుకు రాకుండా మా తెరచాప చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరించి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

ఈ సందర్భంగా 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న తెరచాప చిత్రం గురించి సంగీత దర్శకుడు ఎంఎల్ రాజా, చిత్ర డిఓపిలు, జబర్దస్త్ నటులు రైసింగ్ రాజు, నాగి, అశోక్, నటుడు రాజేష్ తదితరులు మాట్లాడారు.

తారాగణం: నవీన్‌రాజ్ శంకరాపు, పూజా సుహాసిని, శ్రీలు, జగదీష్ ప్రతాప్ బండారి, రాజీవ్ కనకాల, రాకీ, నాగ మహేష్, పృధ్వీ రాజ్, ఫిష్ వెంకట్, అశోక్ జబర్దస్త్, నాగి జబర్దస్త్, అప్పారావు జబర్దస్త్, రైజింగ్ రాజు, రాజేష్ భూపతి, శ్రీనివాస్ నేస, మాయమచంద్ర, సకారం తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
ప్రొడక్షన్ హౌస్: అనన్య క్రియేషన్స్
నిర్మాత: కైలాష్ దుర్గం
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జోయెల్ జార్జ్
సినిమాటోగ్రఫీ: అజీమ్ & వెంకట్
సంగీత దర్శకుడు: ప్రజాల్ క్రిష్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎంఎల్ రాజా
ఎడిటింగ్: రాజు బోడసింగి
డైలాగ్స్: జోయెల్ జార్జ్, మిద్దె మనోజ్ కుమార్ సాహిత్యం: మిద్దె మనోజ్ కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్: బొడ్డు అమూల్య
కొరియోగ్రఫీ: జీవన్ జార్జ్
PRO: మధు VR
డిజిటల్ మీడియా: డిజిటల్ దుకాణం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fish Venkat
  • #Jabardasth Apparao
  • #Jabardasth Ashok
  • #Jabardasth Nagi
  • #Jagadeesh Prathap Bandari

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version