Nikhil Siddharth: 300 కోట్లు కొట్టిన హీరోకు ఓపెనింగ్స్ లేవా?

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) ‘కార్తికేయ 2’ సినిమాతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హిందీ మార్కెట్‌లో కూడా ఈ చిత్రానికి విపరీతమైన ఆదరణ లభించింది. కంటెంట్ బలంతో పాటు కృష్ణుడి పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడంతోనే ఈ సినిమా సక్సెస్ అయ్యింది. అయితే, ఇంత పెద్ద హిట్ తర్వాత నిఖిల్ రీసెంట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ కి ఓపెనింగ్స్ పరంగా అంతగా స్పందన రాలేదు.

Nikhil Siddharth

ఇంతకుముందు ‘18 పేజెస్’ వంటి సినిమాతోనూ నిఖిల్ మంచి సక్సెస్ అందుకున్నారు. తరువాత వచ్చిన ‘స్పై’ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యింది కానీ ఆశించిన ఫలితం రాలేదు. కథలో లోపాలు ఉండటంతోనే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo)  అనే కొత్త సినిమా తీసుకురావడంతో ఊహించని షాక్ తగిలింది. మొదటి నుంచి ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్ లేకపోవడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.

ఈ సినిమా సుధీర్ వర్మ (Sudheer Varma)  దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రమోషన్ లేకుండా తక్కువగా ఇంటర్వ్యూలతోనే సినిమా ప్రచారం జరగడం గమనార్హం. కంటెంట్ పెద్దగా క్లిక్ కాదని అనుకున్నారో ఏమో గాని ఏదో అలా అలా ప్రమోట్ చేస్తూ వదిలారు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో ‘స్వయంభు’, ‘ది ఇండియన్ హౌస్’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, ఇప్పుడే ఈ కొత్త సినిమాను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంతుచిక్కని విషయంగా మారింది. ఒక మంచి ట్రైలర్ ఉన్నప్పటికీ, ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు ఏర్పడలేదు.

బివిఎస్ఎన్ ప్రసాద్ లాంటి పెద్ద నిర్మాత ఈ సినిమాను నిర్మించడం గమనార్హం. అయితే ఈ స్థాయిలో నిర్మాత ఉంటూ కూడా ప్రమోషన్స్ తక్కువగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేసే అంశం. చానల్స్ కి కొన్ని ఇంటర్వ్యూలు మాత్రమే ఇచ్చి సినిమాను ప్రచారం చేయడం అసలు బజ్‌ క్రియేట్ చేయలేకపోయింది. అనుకున్న టైమ్‌లో మేకర్స్ నుంచి గట్టి ప్రచారం లేకపోవడంతో సినిమాకు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఓపెనింగ్స్ రాలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం నిఖిల్ రేంజ్ కు తగ్గట్టుగా సినిమాకి ఓపెనింగ్స్ రాకపోవడం అందరినీ ఆలోచనలో పడేసింది. కార్తికేయ 2 ద్వారా 300 కోట్ల క్లబ్ లో ఉన్న హీరో సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా రాకపోవడం అనేది ప్రమోషన్ లోపం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కంటెంట్ ఎలా ఉన్నా కొంతమేర ప్రచారం చేస్తే సినిమాకి మరింత ఆదరణ లభించేదని అంటున్నారు.

జాన్వీకి షూటింగ్‌ లేదు.. కానీ హైదరాబాద్‌ వచ్చింది.. కారణమిదేనంటూ..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus