హిట్స్ ఉన్నాయి కానీ మంచి ఆఫర్స్ మాత్రం రావడం లేదు

ప్రెజంట్ జనరేషన్ లో తమన్నా రొమాన్స్ చేయని కథానాయకుడు లేడు, ఆఖరికి సీనియర్ హీరోలందరితోనూ జతకట్టింది తమన్నా. కానీ.. ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. అలాగని ఆమెకు రీసెంట్ గా హిట్స్ లేవా అంటే అదీ కాదు. ఆమె నటించిన “ఎఫ్ 2”, ఐటెమ్ సాంగ్ చేసిన “కె.జి.ఎఫ్” బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కానీ.. ఆమెకు మాత్రం ఇప్పుడు ఒక్కటంటే ఒక్క పెద్ద ఆఫర్ కూడా లేదు. పైగా.. ఆమెకు ప్రస్తుతం వస్తున్న ఆఫర్లన్నీ చిన్న లేదా యంగ్ హీరోస్ తోనే. దాంతో.. అర్జెంట్ గా ఏదైనా ఒక పెద్ద హిట్ కొట్టాలన్న తాపత్రయం ఆమెకు రోజురోజుకూ పెరిగిపోతుంది.

ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రొజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది మాత్రం “సైరా”, ఆ సినిమాలో ఆమెది సెకండ్ లీడ్. ఇక “దటీజ్ మహాలక్ష్మి”లో లీడ్ రోల్ ప్లే చేసినప్పటికీ.. ఆ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఎవరికీ లేదు. అయితే.. తమన్నా కెరీర్ ఇలా అవ్వడానికి కారణం మాత్రం ఆమె రెమ్యూనరేషన్ కోసం చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్నీ సినిమాల్లోనూ నటించడం, ఐటెమ్ సాంగ్స్ చేయడమే అని పేర్కొంటున్నారు. మరి తమన్నా ఈ స్లంప్ నుంచి ఎప్పుడు ఎలా బయటపడుతుంది అనేది తెలియదు కానీ.. ఆమెకు మాత్రం అర్జెంట్ గా ఓ భారీ చిత్రం మాత్రం చాలా అవసరం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus