Prakash Raj: ఆత్మ‌, ప్రేతాత్మ‌లు ఏం లేవు: ప్ర‌కాష్ రాజ్

‘మా’ అసోసియేషన్ కి పోటీగా మరో సంస్థను ఏర్పాటు చేయబోతున్నారని.. దాని పేరు ‘ఆత్మ'(ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) అని ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. దానికి తగ్గట్లుగానే ప్రకాష్ రాజ్ ప్యానెల్ ‘సినిమా బిడ్డలం’ నుంచి గెలిచినా పదకొండు మంది మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అయితే కొత్త అసోసియేషన్ విషయంలో ప్రకాష్ రాజ్ సముఖంగా లేరని తెలుస్తోంది. ఈ విషయంపై ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ”ఆత్మ.. పరమాత్మ.. ప్రేతాత్మ అని ఏదో మొదలు పెడతామని వార్తలు వచ్చాయి.

అలాంటి ఆలోచన లేదు. ‘మా’ అసోసియేషన్‌ సమస్యలపై స్పందించటానికే నేను వచ్చాను. అవసరమైతే ‘మా’లో ఉన్న వాళ్లతో కలిసి పనిచేస్తాం. కానీ, మేమేదో 10మందిని తీసుకుని కొత్త అసోసియేషన్‌ పెట్టే ఆలోచన లేదు” అంటూ స్పష్టం చేశారు. రాజీనామా చేసేది విష్ణుకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కోసమేనని.. ‘మా’ సభ్యుల కోసం, వాళ్ల అభివృద్ధి కోసం బయట ఉండి పనిచేస్తామని చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయంపై కూడా ప్రకాష్ రాజ్ స్పందించారు.

మంచు విష్ణు తన రాజీనామాను ఒప్పుకోనని చెప్పారని.. నేనూ కూడా వెనక్కి తీసుకుంటానని కానీ ఒకే ఒక్క షరతు అని అన్నారు. తెలుగువాడు కాక‌పోయినా.. ‘మా’ ఎలెక్షన్స్ లో పోటీ చేయొచ్చనే.. నిబంధ‌న‌ని బైలాస్ లో మార్చకుండా ఉంటే తనకి ‘మా’ సభ్యుడిగా ఉండడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus