దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వెండి తెరపైన గీసిన అద్భుత కళాఖండం బాహుబలి. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉంటుంది. ఆ మూవీకి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ ని మరింత కనువిందుగా ఉండేలా జక్కన్న శ్రమిస్తున్నారు. అయితే రెండో పార్ట్ లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ డోస్ ఎక్కువగా ఉండబోతోంది. ఇందుకోసం కన్నల్ కణ్ణన్ నేతృత్వంలో 33 స్టూడియోలో వీఎఫ్ ఎక్స్ వర్క్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ సారి రిలీజ్ తేదీల్లో మార్పు ఏమి ఉండకూడదని చిత్ర బృందం శ్రమిస్తోంది. సినిమా ఫస్ట్ కాపీ ని మార్చి 30 వ తేదీ లోపున రెడీ చేయాలనీ రాజమౌళి టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది.
ఏప్రిల్ నెల మొత్తము ప్రచారానికి టైమ్ కేటాయించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారతీయ చిత్రాల్లో ఏ చిత్రానికి లేనంత క్రేజ్ ఈ మూవీకి ఉంది. ఆ ఆసక్తి తగ్గిపోకముందే థియేటర్లోకి ఈ మూవీని రప్పించాలని జక్కన్న బృందం రాత్రి పగలు అని తేడాలేకుండా కష్టపడుతోంది. ఏప్రిల్ 28 నుంచి దాదాపు ఒక నెల పాటు ఏ తెలుగు చిత్రం రిలీజ్ కావడానికి సాహసించడం లేదు. మే నెల తర్వాతే రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.