Nani: నాని సినిమాలతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయిన 8 మంది హీరోయిన్లు వీళ్లే..!

నేచురల్ స్టార్ నాని (Nani) కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా స్థాయిలో ‘దసరా’ మూవీతో పెద్ద అటెంప్ట్ చేస్తున్నాడు.. సినిమాను తన భుజాల మీద వేసుకుని అన్ని భాషల్లోనూ ప్రమోట్ చేస్తున్నాడు.. మూవీ రిజల్ట్ మీద నాని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్, సాంగ్స్ సినిమా మీద మంచి అంచనాలు పెంచేశాయి.. కీర్తి సురేష్ కథానాయికగా.. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించిన పక్కా మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘దసరా’..

దీక్షిత్ శెట్టి కీలకపాత్రలో, పాపులర్ మలయాళం యాక్టర్ షైన్ టామ్ చాకో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.. మార్చి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.. ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్) పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయంటూ గట్టిగా చెప్పుకొస్తున్నారు.. సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఫిక్స్ చేసుకుంది.. ఇది నాని నటించిన 29వ సినిమా.. ఈ సందర్భంగా తన గత చిత్రాల గురించి ఆసక్తికరమైన వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. నాని హీరోగా చేసిన 28 సినిమాలలో 8 మంది కొత్త కథానాయికలను తెలుగు తెరకు పరిచయం చేశాడు.. వాళ్లెవరు?.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

1) కలర్స్ స్వాతి

తన ఫస్ట్ ఫిలిం ‘అష్టా చమ్మా’ తోనే యాంకర్ కలర్స్ స్వాతి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది..

2) నిత్య మీనన్

‘అలా మొదలైంది’ మూవీతో టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ మలయాళీ యాక్ట్రెస్ నిత్య మీనన్ తెలుగు తెరకు పరిచయమైంది..

3) మాళవిక నాయర్

నాగ్ అశ్విన్ డెరక్టర్‌గా డెబ్యూ చేసిన ‘ఎవడే సుబ్రమణ్యం’ తో మరో మలయాళీ భామ మాళవిక నాయర్ ఎంట్రీ ఇచ్చింది..

4) మెహ్రీన్ పిర్జాదా

‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ చిత్రంతో మెహ్రీన్ పిర్జాదా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది..

5) నివేదా థామస్

నివేదా థామస్ ‘జెంటిల్ మెన్’ మూవీతో పరిచయమైంది..

6) అను ఇమ్మానుయేల్

‘మజ్ను’ మూవీతో మరో మలయాళీ బ్యూటీ అను ఇమ్మానుయేల్‌ని కథానాయికగా దింపారు..

7) ప్రియాంక అరుల్ మోహన్

‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ఫిలింతో ప్రియాకం అరుల్ మోహన్ వచ్చింది..

8) శ్రద్థా శ్రీనాథ్

‘జెర్సీ’ సినిమాతో శ్రద్థా శ్రీనాథ్ కథానాయికగా తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus