Celebrities: విడాకులు తీసుకొని విడిపోయిన సినీ జంటలు…లిస్ట్ లో వీళ్ళని అసలు ఊహించి ఉండరు!

రిలేషన్ షిప్స్ అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వకపోవడం మనం చూస్తూనే ఉంటాం. అలా మన సెలబ్రిటీలలో (Celebrities) కూడా కొంత మంది పెళ్లి చేసుకొని తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1) రేవతి – సురేష్ చంద్ర మీనన్

1986 లో రేవతి, నటులు సురేష్ చంద్ర మీనన్ పెళ్లి చేసుకున్నారు. 2013 లో వీళ్లిద్దరు విడిపోయారు.

2) అక్కినేని నాగార్జున – లక్ష్మి దగ్గుబాటి

నాగార్జున 1984 లో లక్ష్మి ని పెళ్లి చేసుకున్నారు. 1990 లో వీళ్లిద్దరు విడిపోయారు.

3) మమతా మోహన్ దాస్ – ప్రజీత్ పద్మనాభన్

2011 లో మమతా మోహన్ దాస్ కి, ప్రజీత్ పద్మనాభన్ తో వివాహం జరిగింది. 2012 లో వీళ్లిద్దరు సపరేట్ అయ్యారు.

4) అదితి రావు హైదరి – సత్యదీప్ మిశ్రా

2009 లో అదితి రావు హైదరి, సత్యదీప్ మిశ్రా పెళ్లి చేసుకున్నారు. 2013 లో వీళ్లిద్దరు విడిపోయారు.

5) సైఫ్ అలీఖాన్ – అమృతా సింగ్

1991 లో సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ పెళ్లి చేసుకున్నారు. 2004 లో వీళ్ళిద్దరూ సపరేట్ అయ్యారు.

6) అరవింద స్వామి – గాయత్రి రామమూర్తి

1994 లో అరవింద స్వామి, గాయత్రి రామమూర్తి పెళ్లి చేసుకున్నారు. 2010 లో వీళ్లు విడిపోయారు.

7) మంచు మనోజ్ – ప్రణతి

మంచు మనోజ్, ప్రణతి 2015 లో వివాహం చేసుకున్నారు. 2019 లో వాళ్ళిద్దరూ అధికారికంగా విడిపోతున్నట్లు మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

8) నోయల్ – ఎస్తేర్

2019 లో నోయల్, ఎస్తేర్ వివాహం చేసుకున్నారు. 2020 లో వీళ్ళిద్దరూ విడిపోయారు.

9) సుమంత్ – కీర్తి రెడ్డి

2004 లో సుమంత్, కీర్తి రెడ్డి పెళ్లి చేసుకున్నారు. 2006 లో వీళ్లు సపరేట్ అయ్యారు.

10) రాధిక – ప్రతాప్ పోతన్

1985 లో నటుడు ప్రతాప్ పోతన్ తో రాధిక పెళ్లి జరిగింది. 1986 లో వాళ్ళిద్దరూ విడిపోయారు. 1990 లో రిచర్డ్ హార్డీ ని పెళ్లి చేసుకున్నారు రాధిక. 1992 లో వాళ్లు విడిపోయారు. 2001 లో నటుడు శరత్ కుమార్, రాధిక పెళ్లి చేసుకున్నారు.

11) అర్బాజ్ ఖాన్ – మలైకా అరోరా

బాలీవుడ్ నటి మలైకా అరోరా, అలాగే సల్మాన్ ఖాన్ తమ్ముడు, నటుడు అయిన అర్బాజ్ ఖాన్ 1998 లో పెళ్లి చేసుకున్నారు. 2017 లో వీళ్ళిద్దరూ విడిపోయారు.

12) కమల్ హాసన్ – వాణి గణపతి

1978 లో వాణి గణపతి ని పెళ్లి చేసుకున్నారు. 1988 లో నటి సారిక తో కమల్ హాసన్ పెళ్లి జరిగింది. వీరిద్దరూ 2004 లో విడిపోయారు.

13) ప్రకాష్ రాజ్ – లలిత కుమారి

1994 లో నటి లలిత కుమారి ని వివాహం చేసుకున్నారు ప్రకాష్ రాజ్. 2009 లో వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకున్నారు. 2010 లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మని పెళ్లి చేసుకున్నారు.

14) హృతిక్ రోషన్ – సుస్సాన్ ఖాన్

2000 సంవత్సరంలో హృతిక్ రోషన్, సుస్సాన్ ఖాన్ పెళ్లి చేసుకున్నారు. 2014 లో వీళ్లు విడిపోయారు.

15) నాగ చైతన్య – సమంత

2017 లో వివాహం అయింది వీరిద్దరికి. అక్టోబర్ 02 2021 న అధికారికంగా తాము విడిపోతున్నట్టు ప్రకటించారు.

16) ధనుష్‌ – ఐశ్వర్య

ధనుష్, ఐశ్వర్యలు నవంబరు 18, 2004లో పెళ్లి చేసుకున్నారు. జనవరి 17 ,2022 అధికారికంగా విడిపోతున్నట్టు ప్రకటించారు

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus