సినిమా సెన్సార్‌కి వెళ్లాక… కట్‌లు, మ్యూట్‌లు, బీప్‌లు కామన్. కొన్ని సినిమా విషయంలో ఈ లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది. తాజాగా విడుదలకు సిద్ధమవుతున్న ‘వకీల్‌సాబ్’కి సంబంధించి సెన్సార్ పూర్తయిన విషయం తెలిసిందే. యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రంలో సెన్సార్ కట్స్ ఏమీ లేనప్పటికీ చాలా మాటలు బీప్/మ్యూట్ వేశారట. ఇంతకీ ఏంటా మాటలనేవి చూద్దాం! సినిమాను సెన్సార్ చేసేటప్పుడు చాలా మాటల్ని తీసేయమంటుంటారు. దాంతోపాటే సబ్ టైటిల్స్ కూడా తొలగిస్తారు.
అలా ఈ సినిమాలో మొత్తంగా ఐదు సందర్భాల్లో మాటల్ని మ్యూట్/బీప్ చేశారు. సినిమాలో వంశీ పాత్ర నోటి నుండే వచ్చే బిచ్, బ్లడీ స్లాగ్ లాంటి పదాలను మ్యూట్ చేశారు. దీంతోపాటు మరికొన్ని నాటు పదాలను కూడా తొలగించారు. శివ అనే పాత్ర చెప్పే ‘కింద నువ్వు చూసుకో..’ డైలాగ్‌ను పూర్తిగా తీసేశారు. ఓ పోలీసు ఆఫీసర్ పలికే ‘ప్రాస్టిట్యూషన్’ అనే పదాన్ని మ్యూట్ చేశారు. సినిమా ట్రైలర్ చూస్తే… ముగ్గురు అమ్మాయిల మీద పడ్డ నిందను చెరిపేయడానికి పాటుపడ్డ లాయర్ కథ అని అర్థమైపోతుంది.
ఇప్పుడు డిలీట్ చేసిన పదాలు/మాటలు కూడా ఆ అమ్మాయిల నేపథ్యంలో సాగేలానే ఉన్నాయి. మ్యూట్/బీప్ చేసిన మాటల్లో కొన్ని సినిమాల్లో వినిపిస్తూ ఉంటాయి. మొన్నీమధ్య వచ్చిన ‘విరాటపర్వం’ టీజర్‌లోనూ ఓ డైలాగ్ వినిపించింది. మరి ఈ సినిమాలో ఎందుకు మ్యూట్ చేశారనేది దర్శకుడే చెప్పాలి. ఈ నెల 9న సినిమా వచ్చేస్తోంది కదా.. ఆ రోజు చూద్దాం. ఎక్కడ ఈ మాటలు మ్యూట్ చేశారా అనేది.