Akhanda Remake:బాలయ్యను మించి నటించడం సాధ్యమా?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ప్రభాస్, కొరటాల శివ మహేష్, పూరీ జగన్నాథ్ మహేష్, త్రివిక్రమ్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ పవన్ ఇలా కొన్ని కాంబినేషన్లకు క్రేజ్ ఉంది. ఈ కాంబినేషన్లతో పాటు బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ఈ కాంబినేషన్ లో సినిమాల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సింహా, లెజెండ్ సినిమాలను మించి అఖండ సినిమా విజయం సాధించింది. అఖండ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగణ్ ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే అఖండ సినిమా రీమేక్ కు ఒక సమస్య ఉందని తెలుస్తోంది. అఖండ సినిమాలో అఘోరా పాత్రకు బాలయ్య పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. నటుడిగా బాలయ్య కెరీర్ లోని బెస్ట్ సినిమాలలో అఖండ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు.

బాలయ్య స్థాయిలో హిందీలో రౌద్రం పలికించడం సులువైన విషయం కాదు. కొన్ని సీన్లలో బాలయ్య తప్ప మరెవరు నటించినా ఆ సీన్లు తేలిపోతాయి. అఖండను హిందీలో రీమేక్ చేసినా కథలో చాలా మార్పులు చేయాలి. సినిమాను తెరకెక్కించే విషయంలో పొరపాట్లు చేస్తే సినిమా హిందీలో ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది. హిందీలోని భారీ నిర్మాణ సంస్థలు అఖండ రీమేక్ హక్కుల కోసం పోటీ పడ్డాయని ప్రముఖ సంస్థ ఈ హక్కులను చేజిక్కించుకుందని సమాచారం.

హిందీలో ఈ సినిమాకు హీరో సెట్ కావాల్సి ఉంది. హీరో సెట్ అయినా బాలయ్యను మించి ఆ పాత్రలో నటించి మెప్పించడం అసాధ్యమని కామెంట్లు వినిపిస్తున్నాయి. హిందీలో కూడా అఖండ రీమేకై సక్సెస్ సాధిస్తే మరిన్ని భాషల్లో ఈ మూవీ రీమేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అఖండ మూవీ వీక్ డేస్ లో కూడా భారీగా కలెక్షన్లను సాధిస్తోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus