మూడు గంటలపాటు రామ్ గోపాల్ వర్మను ప్రశ్నించిన పోలీసులు

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులను కలవడం.. పోలీసులు వర్మని ప్రశ్నించడం కొత్తేమీ కాదు. కానీ ఈ రోజు మాత్రం వర్మపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో సామాజిక కార్యకర్త, మహిళా సంఘం నాయకురాలు దేవి తనతో వర్మ జీఎస్టీ తీస్తానని చెప్పడంపై ఆమె నాంపల్లిలోని సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో పాటు మరికొంతమంది ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సీసీఎస్‌ పోలీసులు వర్మని నేడు మూడు గంటల పాటు ప్రశ్నించారు. మాకు అందిన సమాచారం మేరకు పోలీసులు అడిగిన ప్రశ్నలు ఇవే..

– మహిళా సంఘం నాయకురాలు దేవితో మీరు పోర్న్‌ సినిమా తీస్తాననడం ఎంత వరకు కరెక్ట్‌?
– మహిళలను అశ్లీలంగా చూపించడం తప్పు. దీనిపై మీ సమాధానం ఏంటి?
– వైజాగ్‌ మహిళపై మీరు చేసిన కామెంట్‌ను ఎలా సమర్థించుకుంటారు?
– మీ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో పెట్టిన మాల్కోవా ఫొటోలు ఎక్కడివి ? జీఎస్టీని ఏ ఉద్దేశంతో తీశారు?
– భారతీయ చట్టాలకు ఈ సినిమా వర్తించదని ఎలా చెబుతున్నారు?
– సినిమా పెట్టుబడి ఎక్కడిది. విమియో వెబ్‌సైట్‌కి ఎంతకు అమ్మారు?
– మాల్కోవాకి డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారు?
– ఇంత డబ్బు ఎక్కడిది, అమెరికాలు డబ్బులు మీకు ఎవరు ఇచ్చారు ? ఇలా మొత్తం పది ప్రశ్నలు రామ్‌గోపాల్‌వర్మకు పోలీసులు అడిగినట్లు తెలిసింది. అలాగే అతని ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ సీజ్ చేశారు. కేసు విచారణ కొనసాగుతోంది. వచ్చే శుక్రవారం కూడా వర్మని మరోమారు ప్రశ్నించనున్నారు. ఆధారాలను బట్టి శిక్ష వేయాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus