Devara: గోపీచంద్ ప్లాప్ సినిమాకి.. ‘దేవర’ కి సంబంధం ఏంటి?

6 ఏళ్ళ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్  (Jr NTR)  హీరోగా ‘దేవర’ (Devara) సినిమా రూపొందింది. కొరటాల శివ (Koratala Siva)  ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో వీరి కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) అనే సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా మంచి ఫలితాన్నే అందుకుంది. దీంతో ‘దేవర’ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. పైగా ‘ఆర్.ఆర్.ఆర్’ తో (RRR) ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అందుకే సెప్టెంబర్ 27న తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల కానుంది ‘దేవర’.

Devara

అనిరుధ్ (Anirudh Ravichander)  ఈ చిత్రానికి సంగీతం అందించాడు. విడుదలైన 3 పాటలు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. అయితే ట్రైలర్ కి మాత్రం కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓవర్సీస్ బుకింగ్స్ కూడా స్లో అయ్యాయి. కాబట్టి వెంటనే ఇంకో ట్రైలర్ వదిలి బజ్ తెచ్చుకునే దిశగా ‘దేవర’ టీం ప్లాన్ చేస్తుంది. ఇదిలా ఉంటే… ఇటీవల ‘దేవర’ సెన్సార్ కంప్లీట్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ చిత్రానికి కొన్ని కట్స్ తో యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ వారు.

అయితే ఈ సినిమా కథ కూడా లీక్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కథ ఇదేనంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి. సముద్రంలో స్మగ్లింగ్ చేసే శ్రీకాంత్ (Srikanth) అండ్ టీం ఒకటి. మరోవైపు విలన్ గ్యాంగ్ కూడా ఇదే బిజినెస్ చేస్తుంటుందట. అయితే వీరికి అడ్డొచ్చిన శ్రీకాంత్ అండ్ టీంని సైఫ్ అలీ ఖాన్  (Saif Ali Khan) టీం చంపేస్తూ ఉంటారట. అలాంటి పరిస్థితుల్లో దేవర శ్రీకాంత్ అండ్ టీంకి అండగా నిలబడతాడట. తర్వాత దేవర సముద్రంలో స్మగ్లింగ్ బిజినెస్ చేయొద్దు, అన్యాయంగా బ్రతికింది చాలు అంటూ తన వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తాడట.

ఆ టైంలో శ్రీకాంత్ వెళ్లి.. సైఫ్ అలీ ఖాన్ గ్యాంగ్ తో చేతులు కలిపి ‘దేవర’ ని చంపడానికి ప్రయత్నిస్తాడట. తర్వాత దేవర కొడుకు పిరికివాడిగా ఉండి.. చివర్లో పూనకం తెచ్చుకుని తన తండ్రిని చంపిన వారిని హతమారుస్తాడట. ఈ కథ చాలా వరకు గోపీచంద్ (Gopichand)  నటించిన ‘భీమా’ కి  (Bhimaa) దగ్గరగా ఉంది అంటున్నారు. అలాగే అక్కడక్కడ ‘కాంతార’ టచ్ కూడా ఉంటుందని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో.. సెప్టెంబర్ 27న తెలుస్తుంది.

రిలీజ్ అవ్వడమే కష్టం అనుకుంటే.. కోటి బిజినెస్ చేసిన చిన్న సినిమా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus