కరోనా కారణంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. రీసెంట్ గా థియేటర్లు ఓపెన్ చేసినా.. ఏపీలో యాభై శాతం ఆక్యుపెన్సీ, టికెట్ రేట్ ఇష్యూల వలన నిర్మాతలు మళ్లీ ఓటీటీలపై పడ్డారు. ఈ క్రమంలో నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా అలానే నితిన్ నటించిన ‘మ్యాస్ట్రో’, వెంకీ ‘దృశ్యం2’ సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. ‘మ్యాస్ట్రో’, ‘దృశ్యం 2’ సినిమాలు హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.
‘టక్ జగదీష్’ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఇక ఇదే రూట్ లో గోపీచంద్ నటించిన ‘సీటీమార్’, శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’, శర్వానంద్ నటిస్తోన్న ‘మహాసముద్రం’ సినిమాలు ఓటీటీ కంపెనీలతో చర్చలు మొదలుపెట్టినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాల విషయంలో కూడా క్లారిటీ రానుంది. పేరున్న హీరోలు కూడా తమ సినిమాలను సైలెంట్ గా ఓటీటీలకు అమ్మేస్తున్నారు.
అందుకే ఇప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలన్నీ కూడా ఓటీటీ బాట పట్టేలా ఉన్నాయి. దానికి కారణం థియేటర్ వ్యాపారం అనుకూలంగా లేకపోవడమే. తెలంగాణలో హైదరాబాద్ లో తప్ప మిగిలిన చోట్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. అందుకే ఓటీటీలో విడుదలయ్యే సినిమాల లిస్ట్ బాగా పెరుగుతుంది.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!