కరోనా సెకండ్ వేవ్ వల్ల స్టార్ హీరోల ప్లాన్లన్నీ తారుమారైన సంగతి తెలిసిందే. ఈ నెలలో ఆచార్య, అఖండ, నారప్ప సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా సీనియర్ హీరోలు తమ సినిమాల రిలీజ్ డేట్లను వాయిదా వేసుకున్నారు. ఈ సినిమాలు ఎప్పుడు రిలీజవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది సంక్రాంతి వరకు సాధారణ పరిస్థితులు ఏర్పడకపోవచ్చని తెలుస్తోంది. మరో రెండు, మూడు నెలల్లో షూటింగ్ లు మొదలైనా థియేటర్లలో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించాలంటే సమయం పట్టేలా ఉంది.
వచ్చే ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడితే మాత్రం ఈ రెండు సినిమాలు సంక్రాంతికే రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి ఫిక్స్ కావడంతో మిగతా సినిమాలు సంక్రాంతికి ఫిక్స్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలు, దర్శకనిర్మాతలను తెగ టెన్షన్ పెడుతోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంటే తమ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించవచ్చని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
రాజమౌళి ఇప్పటికీ అక్టోబర్ 13వ తేదీనే సినిమాను రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ఆచార్య, అఖండ, నారప్ప, పుష్ప, కేజీఎఫ్ ఛాప్టర్ 2, రాధేశ్యామ్ సినిమాలకు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకోవడం దర్శకనిర్మాతలకు కష్టంగా మారింది. అనుకున్న విధంగా సర్కారు వారి పాట, హరిహర వీరమల్లు షూటింగ్ జరగకపోతే మాత్రం ఊహించని సినిమాలు 2022 సంక్రాంతి రేసులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. పవన్, మహేష్ 2022 సంక్రాంతికి సినిమాలను ఫిక్స్ చేసుకొని సేఫ్ జోన్ లో ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!