ఈ వారం ప్రేక్షకులను అలరించనున్న సినిమాలు!

ప్రతి వారం కొత్త సినిమాలు, సిరీస్ లు విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు, సిరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం!

Click Here To Watch

మహాన్: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఆయన కుమారుడు ధృవ్ కలిసి నటిస్తోన్న సినిమా ‘మహాన్’. ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. ఈ నెల 10న సినిమా రిలీజ్ కానుంది.

ఖిలాడి: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఖిలాడీ’ సినిమాను ఈ నెల 11న విడుదల చేయబోతున్నారు. ఇందులో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనసూయ కీలకపాత్ర పోషిస్తుంది.

సెహరి: యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ జంటగా నటిస్తోన్న ‘సెహరి’ సినిమాను ఈ నెల 11న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ కి యూత్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

డీజే టిల్లు: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈనెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీ రిలీజులు..

మళ్లీ మొదలైంది: సుమంత్, నైనా గంగూలీ, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 11న జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కానుంది.

భామాకలాపం: ప్రియమణి ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా ‘భామాకలాపం’. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 11న ఆహాలో సినిమా రిలీజ్ కానుంది.

గెహ్రాయియా: దీపికా పదుకోన్, అనన్యా పాండే, సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

హీరో: మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన ‘హీరో’ సినిమా ఇప్పటికే థియేటర్లో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పడూ ఈ సినిమాను హాట్ స్టార్ లో ఫిబ్రవరి 11 నుంచి స్త్రీమింగ్ చేయనున్నారు.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus