KGF2 Movie: కేజీఎఫ్ 2 అంతకు మించి ఉంటుందా?

రాకింగ్ స్టార్ యశ్ కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్2 టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించగా ఈ సినిమా క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ లో ఎమోషన్స్ ఎక్కువగా ఉండేలా ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకున్నారని సినిమాలో సెంటిమెంట్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

మూవీలో స్ట్రాంగ్ ఎలివేషన్ సీన్లు కూడా ఎక్కువగా ఉంటాయని రాకీ కింగ్ మేకర్ గా ఎదగడాన్ని ప్రశాంత్ నీల్ అద్భుతంగా చూపించారని సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. ఫస్ట్ పార్ట్ హిట్ కావడానికి కారణమైన సన్నివేశాలను దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ ను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమాను తెరకెక్కిస్తూ ఆ సినిమా పనులతో బిజీగా ఉన్నారు.

వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కేవలం 4 నెలల గ్యాప్ లో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన రెండు సినిమాలు రిలీజ్ కానుండటం గమనార్హం. సలార్ సినిమా పూర్తైన వెంటనే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus