విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీ భారీ అంచనాలతో విడుదలై పూర్తిస్థాయిలో ఆ అంచనాలను అందుకోలేకపోయినా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. లియో ఫ్లాష్ బ్యాక్ విషయంలో ఊహించని స్థాయిలో విమర్శలు రావడంతో ఆ ఫ్లాష్ బ్యాక్ నిజం కాదంటూ లోకేశ్ కనగరాజ్ కామెంట్లు చేశారు. అయితే ఈ సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.
లోకనాయకుడు కమల్ హాసన్ కు ఐదేళ్ల క్రితం లోకేశ్ కనగరాజ్ ఈ కథ చెప్పారని కథ నచ్చినా వేర్వేరు కారణాల వల్ల ఆయన ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని సమాచారం అందుతోంది. కమల్ హాసన్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా కమల్ లియో కంటే విక్రమ్ కథ అద్భుతంగా ఉండటంతో ఆ సినిమాకు ఓకే చెప్పారని సమాచారం అందుతోంది. కమల్ లోకేశ్ కాంబోలో రాబోయే రోజుల్లో విక్రమ్2 సినిమా తెరకెక్కనుంది.
మరోవైపు లియోకు (LEO) సీక్వెల్ తెరకెక్కినా ప్రేక్షకాదరణ ఊహించని స్థాయిలో పొందుతుందా అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. లోకేశ్ కనగరాజ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ రేంజ్ లో ఉంటూనే మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విజయ్ లోకేశ్ కనగరాజ్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకోవాలని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్లను సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
స్టార్ హీరో విజయ్ గత మూడు సినిమాలు భారీ అంచనాలతో విడుదలైనా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిలయ్యాయి. విజయ్ రెమ్యునరేషన్ 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. విజయ్ తెలుగులో మార్కెట్ ను పెంచుకోవాలన్న కలను మాత్రం నెరవేర్చుకున్నారు. స్టార్ ప్రొడ్యూసర్లు విజయ్ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడం విజయ్ కు కలిసొచ్చిందని నెటిజన్లు చెబుతున్నారు.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!