Pushpa2: పుష్ప2 లో ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఈమెకు దక్కిందా?

  • May 9, 2023 / 02:31 PM IST

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప మూవీ ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సక్సెస్ సాధించడానికి ఊ అంటావా సాంగ్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. సమంత ఈ సాంగ్ లో డ్యాన్స్ చేయడం ఈ సినిమాకు ప్లస్ అయింది. పుష్ప1 మూవీ నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించిన సంగతి తెలిసిందే. పుష్ప2 సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉందని తెలుస్తోంది.

పుష్ప2 లో కూడా స్పెషల్ సాంగ్ లో సమంత కనిపిస్తారని వార్తలు వినిపించినా ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టత వచ్చింది. పుష్ప2 సినిమాలో స్పెషల్ సాంగ్ లో సీరత్ కపూర్ కనిపించనున్నారని సమాచారం. సమంతకు షాకిస్తూ బన్నీతో కలిసి సీరత్ కపూర్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం. సీరత్ కపూర్ తెలుగులో కొన్ని సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

పుష్ప2 (Pushpa2) సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని బన్నీ పాత్రలో మరిన్ని ప్రత్యేకతలు ఉండేలా మేకర్స్ చూసుకున్నారని తెలుస్తోంది. సుకుమార్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమా షూట్ జరుగుతోంది. పుష్ప1, పుష్ప2 సినిమాల కోసం అల్లు అర్జున్ ఏకంగా నాలుగేళ్ల సమయం కేటాయించడం గమనార్హం.

పుష్ప2 సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ నిర్మాతలు టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. మైత్రీ బ్యానర్ లో ప్రభాస్ సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా ఆగిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. త్వరలో మైత్రీ నిర్మాతల నుంచి ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus