డిసెంబర్ నెలంతా ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) దే.. అని చెప్పడంలో సందేహం లేదు. రాంచరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా రిలీజ్ అయ్యే వరకు ‘పుష్ప 2’ నే ప్రేక్షకులు ఫస్ట్ ఆప్షన్ గా భావించే అవకాశం ఉంది. ఇది కాకుండా సెకండ్ ఆప్షన్ అనుకుంటే.. ‘ముఫాసా ది లయన్ కింగ్’ ఉంది. అది చిన్నపిల్లలా సినిమా అనుకుంటే కనుక, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ప్రియదర్శి (Priyadarshi) ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam), నితిన్ (Nithiin) ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమాలు ఉండేవి.
Bachhala Malli
‘బలగం’ (Balagam) తర్వాత ప్రియదర్శి సినిమాలకి థియేట్రికల్ బిజినెస్ బాగా జరుగుతుంది. మరోపక్క ‘భీష్మ’ (Bheeshma) వంటి హిట్ ఇచ్చిన కాంబినేషన్ కాబట్టి ‘రాబిన్ హుడ్’ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్లోటింగ్ ఉంటుంది. మరోపక్క వాటి పక్కన అల్లరి నరేష్ (Allari Naresh) ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) సినిమాని డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్లు ఆ సినిమా మేకర్స్ ప్రకటించారు. ‘నాంది’ తర్వాత అల్లరి నరేష్ హిట్ అందుకోలేదు. ఇలాంటి టైంలో క్రేజీ సినిమాల మధ్య ‘బచ్చల మల్లి’ వస్తే హిట్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద నలిగిపోవడం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు.
కానీ నరేష్ టైం బాగున్నట్టు ఉంది.. నితిన్ ‘రాబిన్ హుడ్’ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ కూడా వాయిదా పడనుందని తెలుస్తుంది. సో ‘ది లయన్ కింగ్’ తర్వాత సెకండ్ ఆప్షన్ గా ఆడియన్స్ ‘బచ్చల మల్లి’ కి ఓటేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ దీనికి హిట్ టాక్ కనుక వస్తే.. క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ ని కూడా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది.