‘చిత్రలహరి’ తో హిట్టందుకున్నాడు.. కానీ?

సుప్రీమ్ హీరో సాయి తేజ్ నుండీ వచ్చిన తాజా చిత్రం ‘చిత్రలహరి’. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పెత్తురాజ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసాడు. ఆరు ప్లాపుల తరువాత తేజు.. ఈ చిత్రంతో హిట్టందుకున్నాడు. అయితే అది తేజు స్థాయి హిట్టయితే కాదు. మొదటి 3 చిత్రాలకే మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మన మెగా మేనల్లుడు ‘విన్నర్’ చిత్రం నుండీ డిజాస్టర్లు చూడటం మొదలు పెట్టాడు. ‘విన్నర్’ చిత్రానికి 25 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగగా… చిత్రానికి ప్లాప్ టాక్ రావడంతో 16 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

ఇక తేజు తరువాతి సినిమాల పరిస్థితి మరీ ఘోరం. 10 కోట్లు కూడా రాబట్టలేని సినిమాలు చాలా ఉన్నాయి. ఫైనల్ గా ‘చిత్రలహరి’ చిత్రంతో హిట్టు కొట్టాడు. అయితే ఈ చిత్రానికి 13 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో డీసెంట్ కలెక్షన్లు కూడా వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ స్టేటస్ ను దక్కించుకుంది. అయితే అది తేజు రేంజ్ హిట్టు కాదనే చెప్పాలి. అందులోనూ తేజు మార్కెట్ బాగా డౌన్ అయిపోయిందనేది కూడా గమనించాల్సిన విషయం. అయితే వరుసగా కొత్త సినిమాలు రావడంతో ఈ పరిస్థితి వచ్చింది అనేది నిజమే.! ఈ చిత్రంతో కాస్త ఊపిరి పీల్చుకున్న తేజు తరువాతి సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంటాడేమో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus