నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం అఖండ 2 పాన్ ఇండియా రిలీజ్ డిసెంబర్ 5న (గత శుక్రవారం) అవ్వాల్సి ఉండగా, ఫైనాన్సియల్ వివాదాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడటం అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. అయితే తాజా సమాచారం మేరకు సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయంట దీంతో త్వరలోనే కొత్త తేదీని టీమ్ అధికారికంగా ప్రకటించబోతోందని తెలుస్తోంది.
అయితే బాలకృష్ణ కెరీర్‌లో ఇలా జరగటం మొదటి సారి కాదు. గతంలో కూడా రెండు చిత్రాలు ఇలా విడుదలకు సిద్ధం అయ్యాక రెండు రోజుల ముందే వాయిదా పడ్డాయి. 2003లో బి. గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ, సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. ఈ చిత్రం కూడా రిలీజ్‌కు రెండు రోజుల ముందు అనుకోని కారణాల వల్ల నిలిచిపోయింది. 2007లో వచ్చిన మీరాజాస్మిన్, స్నేహ జంటగా నటించిన ‘మహారధి’ సినిమా రిలీజ్ కు ముందు సమస్యలు తలెత్తడంతో రెండు రోజులు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది.
ఇప్పుడు మళ్లీ అఖండ 2 వాయిదా… ఎఫెక్ట్ ఎవరికి ?
ఫైనాన్స్ సమస్యలు క్లియర్ కావడంతో తాజా విడుదల తేదీగా డిసెంబర్ 12ను నిర్ణయించినట్లు సమాచారం. 11న ప్రీమియర్లు కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కానీ ఇందులో ట్విస్ట్ ఏమిటంటే….అదే రోజున ఇప్పటికే ‘మోగ్లీ’, ‘అన్నగారు వస్తారు’, ‘ఈషా’, ‘సైక్ సిద్ధార్థ్’ వంటి చిన్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అఖండ 2 లాంటి పెద్ద హీరో, పాన్ ఇండియా సినిమా అదే తేదీలోకి రావడం వల్ల ఈ చిన్న చిత్రాలు తమ విడుదలను మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఏ సినిమాలు వెనక్కి తగ్గబోతున్నాయో చూడాలి.
అఖండ 2 రిలీజ్ వాయిదా, రీషెడ్యూల్ తో బాలయ్య సినిమాకు క్రేజ్ పెరిగినా… చిన్న సినిమాల బాక్సాఫీస్ ప్లానింగ్ మాత్రం గందరగోళంలో పడిపోయిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.