Siddharth, Aditi Rao Hydari: సిద్దార్థ్ అదితీరావు హైదరీ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో మీకు తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఒక వెలుగు వెలిగిన సిద్దార్థ్ కు ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా ఆఫర్లు రావడం లేదనే సంగతి తెలిసిందే. అయితే వనపర్తి జిల్లా శ్రీ రంగాపూర్ లో ఉన్న రంగనాథ స్వామి ఆలయంలో సిద్దార్థ్(Siddharth), అదితీరావు హైదరీల (Aditi Rao Hydari)  వివాహం అంగ రంగ వైభవంగా జరిగింది. తమిళనాడు నుంచి పురోహితులు ఈ పెళ్లి వేడుకను నిర్వహించారని సమాచారం అందుతోంది. అయితే సిద్దార్థ్, అదితీరావు హైదరీల మధ్య ఏజ్ గ్యాప్ ఏడు సంవత్సరాలు అని సమాచారం.

అదితీరావు హైదరీ వనపర్తి సంస్థానాదీశులలో చివరి రాజుగా ఉన్న రామేశ్వర్ రావు మనవరాలు కావడంతో ఈ ఆలయంలో పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. మొదట షూటింగ్ అని చెప్పి అనుమతులు తీసుకుని సిద్దార్థ్, అదితి పెళ్లి చేసుకున్నారని సమాచారం. సిద్దార్థ్, అదితిల పెళ్లి వేడుక గ్రాండ్ గా జరగగా తమిళనాడులో ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

సిద్దార్థ్ 2003 సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితురాలు అయిన మేఘనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో 2007 సంవత్సరంలో ఈ జంట విడాకులు తీసుకోవడం జరిగింది. అదితీరావు హైదరీ 2002 సంవత్సరంలో సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని 2012 సంవత్సరంలో భర్తతో విడిపోయారని సమాచారం అందుతోంది.

సిద్దార్థ్, అదితీరావు హైదరీ తమ పెళ్లి గురించి మీడియాతో పంచుకోవడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. సిద్దార్థ్, అదితీరావు హైదరీలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. భవిష్యత్తులో అయినా సిద్దార్థ్, అదితీరావు హైదరీ పెళ్లి ఫోటోలను మీడియాతో పంచుకుంటారేమో చూడాల్సి ఉంది. సిద్దార్థ్, అదితీరావు హైదరీ భవిష్యత్తులో సినిమాలలో కలిసి నటిస్తారేమో తెలియాల్సి ఉంది. అటు సిద్దార్థ్ ఇటు అదితీరావు హైదరీ రెమ్యునరేషన్లు భారీ రేంజ్ లో ఉన్నాయని తెలుస్తోంది.

టిల్లు స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గోట్ లైఫ్: ఆడు జీవితం సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్‌ మైనపు విగ్రహం చూశారా? అదగొట్టేశారు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus