‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు అల్లు అర్జున్ (Allu Arjun). అంతేకాదు జాతీయ పురస్కారం కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చేసింది. తాజాగా బన్నీకి మరో అరుదైన గౌరవం కూడా వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. దుబాయిలోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని మార్చి 28న రాత్రి లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బన్నీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
‘అల వైకుంఠపురములో…’ సినిమాలోని వైబ్రంట్ రెడ్‌కలర్ కోట్ కాస్ట్యూమ్‌తో ‘పుష్ప’ సినిమాలోని ‘తగ్గేదేలే’ మేనరిజంతో ఆ విగ్రహాన్ని రూపొందించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బన్నీ కుటుంబంతో పాటు దుబాయ్ వెళ్లాడు. బన్నీ మైనపు విగ్రహం లాంచ్ చేసినప్పుడు కూతురు అల్లు అర్హ సందడి చేసింది. ఆ విగ్రహం పక్కన కూర్చొని అలాంటి పోజే ఇచ్చింది. విగ్రహంతో బన్నీ సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తగ్గేదేలే అని రాసుకొచ్చాడు.
ఈ ఫొటోలు చూస్తుంటే బన్నీకి, మైనపు విగ్రహానికి ఏ మాత్రం తేడా లేదని అనిపిస్తోంది. డ్రెస్సింగ్, గడ్డం, జుట్టు అంతా ఒకేలా ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. భలేగా చేశారు విగ్రహం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టుస్సాడ్స్ మ్యూజియంలో ఇప్పటికే తెలుగు హీరోలు ప్రభాస్, మహేష్ బాబు విగ్రహాలు ఉన్నాయి. అయితే ఆ రెండు లండన్‌లోని మ్యూజియంలో ఉండగా బన్నీది దుబాయ్‌లో ఏర్పాటు చేయడం గమనార్హం.
బన్నీ సినిమాల సంగతి చూస్తే… ‘పుష్ప: ది రూల్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 15న సినిమా రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ – అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుంది అంటున్నారు. ఆ తర్వాతే త్రివిక్రమ్ సినిమా ప్రారంభిస్తారని టాక్. అయితే ఈ విషయంలో ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా పూర్తి క్లారిటీ వస్తుంది. అప్పటివరకు ఏ సినిమా అనేది పుకార్లుగా మాత్రమే ఉంటుంది.
1
2
3
4