Samantha, Keerthy Suresh: ఆ తప్పుల వల్లే ఈ హీరోయిన్ల కెరీర్ కు నష్టం కలుగుతోందా?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ ను సొంతం చేసుకునే హీరోయిన్లు చాలా తక్కువమంది మాత్రమే ఉంటారు. అలా ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా సత్తా చాటిన హీరోయిన్ల జాబితాలో సమంత, కీర్తి సురేష్ ముందువరసలో ఉంటారు. తమిళంలో నయనతార లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో విజయాలను అందుకుంటుండగా తెలుగులో సమంత, కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తెలుగులో మార్కెట్ ను పెంచుకున్నారు.అయితే ఈ హీరోయిన్లకు స్టార్ హీరోలకు జోడీగా ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు.

కీర్తి సురేష్ పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉన్నా సమంతకు మాత్రం ఛాన్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపడం లేదు. సమంత ఒకవైపు స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లలో నటించి ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కరోనా తర్వాత మార్కెట్ తగ్గింది. సినిమాకు మరీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి. మరోవైపు దసరా, భోళా శంకర్ మినహా కీర్తి సురేష్ చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు.

భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్రలో కనిపిస్తున్నారు. మహానటి సక్సెస్ కీర్తి సురేష్ కు ఒక విధంగా ప్లస్ అయితే మరో విధంగా మైనస్ అయింది. కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. సమంత, కీర్తి సురేష్ కెరీర్ విషయంలో మరింత జాగ్రత్తగా మెలగాల్సి ఉంది. సమంత నటిస్తున్న సినిమాలన్నీ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతుండటంతో బడ్జెట్ భారం ఆమెపై పడుతోంది.

ఈ హీరోయిన్లు ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధిస్తే కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. సమంత, కీర్తి సురేష్ లకు ఈ ఏడాది కలిసిరావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కీర్తి సురేష్ నటించిన దసరా మూవీ ఈ నెలలోనే రిలీజ్ కానుండగా నాని కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కడం గమనార్హం.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus