Buchi Babu, Jr NTR: ఎన్టీఆర్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ కు సమస్య ఇదేనా?

ఆర్ఆర్ఆర్ మూవీ అంచనాలను మించి విజయాన్ని అందుకున్నా కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ సినిమాలో స్క్రీన్ స్పేస్ విషయంలో ఎన్టీఆర్ కు అన్యాయం జరిగిందని చెబుతున్నారు. ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్ట్ లకు కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకులుగా ఉన్నారు. ఈ ఇద్దరు డైరెక్టర్లు టాలెంట్ ఉన్న డైరెక్టర్లు కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఈ సినిమాల ఫలితాల విషయంలో కంగారు పడటం లేదు. అయితే ఎన్టీఆర్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ కు సంబంధించి సస్పెన్స్ కొనసాగుతోంది.

Click Here To Watch NOW

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో కూడా ఎన్టీఆర్ ఎక్కడా బుచ్చిబాబు ప్రాజెక్ట్ కు సంబంధించి నోరు విప్పలేదు. అయితే ఈ సినిమా విషయంలో తారక్ కన్ఫ్యూజన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న తారక్ కథల ఎంపిక విషయంలో, దర్శకుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం పొరపాటు చేసినా కెరీర్ పై ఆ ప్రభావం పడుతుందని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు.

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. అయితే సినిమాలో కొన్ని సీన్లలో ఎన్టీఆర్ వికలాంగుడిగా కనిపిస్తారని బోగట్టా. క్లైమాక్స్ లో తారక్ ఈ విధంగా కనిపించాల్సి ఉంటుందని ఈ స్క్రిప్ట్ లో మార్పులు చేయడానికి బుచ్చిబాబు అంగీకరించలేదని సమాచారం అందుతోంది. తను అనుకున్న విధంగా సినిమాను తెరకెక్కిస్తే మాత్రమే సినిమా సక్సెస్ సాధిస్తుందని బుచ్చిబాబు భావిస్తున్నారని బోగట్టా. ఈ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఎన్టీఆర్ మాత్రం ఆర్ఆర్ఆర్ ద్వారా వచ్చిన గుర్తింపును మరింత పెంచే ప్రాజెక్ట్ లకు మాత్రమే ఓటేయాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి. త్వరలో ఎన్టీఆర్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ బుచ్చిబాబు సినిమాకు మాట ఇవ్వలేకఈ సినిమాను వదులుకోలేక కన్ఫ్యూజన్ తో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus