Rajamouli,Ranbir Kapoor: అలియా రుణం తీర్చుకోవడానికి రాజమౌళి ఇలా చేస్తున్నారా?

  • November 28, 2023 / 08:34 PM IST

దర్శక వీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం RRR. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడి గా బాలీవుడ్ నటి అలియా భట్ నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆమెకు అనుకున్న స్థాయిలో స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదని చెప్పాలి. ఇలా అంత పెద్ద సినిమాలు ఆమెను తీసుకొని తనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని అప్పట్లో రాజమౌళి పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ని తీసుకొని తన పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె అభిమానులు కూడా విమర్శలు కురిపించారు. అయితే ఆ తప్పు సరిదిద్దుకోవడం కోసం తన రుణం తీర్చుకోవడం కోసం రాజమౌళి తన భర్త సినిమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ అలియా రుణం తీర్చుకుంటున్నారు అంట తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.

రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమాకు రాజమౌళి తెలుగులో సపోర్ట్ చేస్తూ ఈ సినిమాని ఆయనే విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా రాజమౌళి పాల్గొన్నారు. ఇకపోతే తాజాగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన అనిమల్ సినిమా విషయంలో కూడా రాజమౌళి చాలా ఆసక్తి చూపుతున్నారు.

ఈ సినిమాకు రాజమౌళి (Rajamouli) పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడమే కాకుండా ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ఈయన ముఖ్య అతిథిగా హాజరైన సంగతి మనకు తెలిసిందే. ఇలా రాజమౌళి చాలా తక్కువగా ఫ్రీ రిలీజ్ వేడుకలకు హాజరవుతూ ఉంటారు కానీ రణబీర్ విషయంలో మాత్రం ఆయన సినిమాలన్నింటికీ సపోర్ట్ చేయడం చూస్తుంటే అలియా భట్ కు ఈ విధంగా రాజమౌళి రుణం తీర్చుకుంటున్నారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus