Rashmika: మేనేజర్ కారణంగా టాలీవుడ్ అవకాశాలు కోల్పోతున్న రష్మిక?

నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు అయితే కొద్ది వారాల క్రితం ఈమె వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరో నితిన్ తో కలిసి ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ కాంబినేషన్లోనే ఇదివరకే భీష్మ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విషయాన్ని అంతుకుంది. అదేవిధంగా రష్మికను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన డైరెక్టర్ కూడా వెంకీ కుడుములు కావడం విశేషం. నాగశౌర్య రష్మిక నటించిన చలో సినిమాకు ఈయనే దర్శకత్వం వహించారు.

ఈ విధంగా మరోసారి వెంకి కుడుముల డైరెక్షన్లో నితిన్ రష్మిక జంటగా సినిమా చేయబోతున్నారన్న విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని భావించారు. అయితే తాజాగా రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే అందుకు కారణం ఈమెకు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే అంటూ బయటికి చెప్పినప్పటికీ లోపల మరొక కారణం ఉందని తెలుస్తోంది.

రష్మిక (Rashmika) ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం తన మాజీ మేనేజర్ కిరణ్ అని తెలుస్తోంది.రష్మిక కిరణ్ మధ్యగత కొంతకాలంగా పలు విభేదాల కారణంగా గొడవ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రష్మిక ఈ విషయంపై స్పందిస్తూ పరస్పరాంగీకారంతోనే తను వెళ్లిపోయినట్టు తెలియజేశారు కానీ ఇద్దరు మధ్య గొడవలు ఉన్నాయని అందుకే కిరణ్ ఈమె మేనేజర్ గా తప్పుకున్నారని తెలుస్తోంది.

ఇక ఈమె సినిమాలకు కమిట్ అవుతుండడంతో కిరణ్ దర్శక నిర్మాతలతో మాట్లాడుతూ రష్మికకు టాలీవుడ్ సినిమాలపై ఏ మాత్రం ఆశక్తి లేదని ఆమె ఇంట్రెస్ట్ మొత్తం బాలీవుడ్ సినిమాలపైనే ఉందని దర్శక నిర్మాతలకు లేనిపోని మాటలు చెప్పడం వల్లే దర్శక నిర్మాతలు రష్మిక విషయంలో మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. ఇలా రష్మిక గురించి చెడుగా ప్రచారం చేయడమే కాకుండా సదురు దర్శక నిర్మాతలకు ఈయన శ్రీ లీల మృణాల్ వంటి వారి పేర్లను కూడా సూచిస్తున్నారట. ఇక ఈ విషయం రష్మికకు తెలియజేయడంతో తానే ఈ సినిమా నుంచి తప్పుకున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus