Allu Arjun: బన్నీ ఏం చేసినా తప్పేనా.. అలా చేస్తే మాత్రమే వివాదాలకు చెక్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) జాతకం ప్రస్తుతం అస్సలు బాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బన్నీ ఏ విషయం గురించి రియాక్ట్ అయినా కాకపోయినా కెరీర్ పరంగా ఇబ్బందులను మాత్రం ఎదుర్కొంటున్నారు. అల్లు అర్జున్ ఏం చేసినా తప్పేనా అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గతంలో చెప్పను బ్రదర్ అంటూ కామెంట్ చేసి వివాదంలో చిక్కుకున్న బన్నీ స్నేహితుని కోసం ప్రచారం చేయడం వల్ల అనవసర వివాదాల్లో చిక్కుకున్నారు. బన్నీ స్పందిస్తే ఒక విధంగా స్పందించకపోతే మరో విధంగా పరిస్థితులు ఉన్నాయి.

Allu Arjun

మెగా ఫ్యామిలీతో కలిసి బన్నీ కనిపిస్తే మాత్రమే చిన్నచిన్న మనస్పర్ధలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఏ కుటుంబంలో అయినా చిన్నచిన్న సమస్యలు సాధారణం కాగా వాటిని వేగంగా పరిష్కరించుకుంటే మాత్రమే బంధాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. వివాదం పెద్దదైన తర్వాత సమస్య పరిష్కారం కోసం చొరవ చూపినా ఫలితం ఉండదు. బన్నీ వయస్సులో చిన్నవాడు కాబట్టి బన్నీనే ఒక అడుగు ముందుకు వేసి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పవచ్చు.

మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ కలిసి ఉంటేనే బాగుంటుందని ఇరు కుటుంబాల మధ్య విబేధాలు రావడం మంచిది కాదని సినీ అభిమానులు సైతం ఫీలవుతున్నారు. పుష్ప2 (Pushpa2) సినిమాపై ఏ మాత్రం ఎఫెక్ట్ పడకుండా బన్నీ అడుగులు పడాల్సిన అవసరం ఉంది. ఒక సినిమా బడ్జెట్ 200 నుంచి 300 కోట్ల రూపాయలు కావడంతో భారీ బడ్జెట్లు నిర్మాతలపై కూడా ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. పుష్ప ది రూల్ మూవీ బన్నీ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాలలో ఒకటిగా నిలవాలని బన్నీ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చివేతపై స్పందించిన నాగచైతన్య.. ఏమన్నాడంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus