Naga Chaitanya: ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చివేతపై స్పందించిన నాగచైతన్య.. ఏమన్నాడంటే?

  • August 28, 2024 / 05:12 PM IST

చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించుకున్నారు అంటూ గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కొన్ని కట్టడాలను, నిర్మాణాలను కూల్చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కథానాయకుడు నాగార్జునకు (Nagarjuna)  చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూడా కూల్చేశారు. ఈ విషయంలో నాగార్జున ఇప్పటికే రెండుసార్లు తన ఉద్దేశాన్ని, రియాక్షన్‌ను చెప్పారు. ఇటీవల నాగచైతన్య (Naga Chaitanya) ఓ ఈవెంట్‌ కోసం బయటకు వస్తే.. ఈ టాపిక్‌ ఆయన దగ్గరకు చర్చకు వచ్చింది. హైదరాబాద్‌లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన నాగచైతన్ దగ్గర ఎన్ కన్వెన్షన్‌ అంశాన్ని ప్రస్తావిస్తే..

Naga Chaitanya

ఆ విషయం ఇప్పుడు వద్దు అని టాపిక్‌ను అక్కడితో ఆపేయించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతకు సంబంధించి నాన్న ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్‌)లో అన్ని వివరాలు చెప్పారని తండ్రి మాటే తన మాట అని క్లారిటీ ఇచ్చేశాడు నాగచైతన్య. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ ఫంక్షన్‌ హాల్‌ను హైడ్రా బృందం ఇటీవల కూల్చివేసింది.

అయితే నాగార్జున ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చింది. చెరువును అంగుళం కూడా ఆక్రమించలేదని నాగార్జున ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతలు సరికాదన్నారు. కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా తానే భవనాలు కూల్చివేసుకునేవాడినని స్పష్టం చేశారు. నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించాం.

అలాగే తాను న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటానని, తీర్పు వెలువడే వరకూ ఎలాంటి వదంతులు, అవాస్తవాలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. పట్టా భూమిలోనే కన్వెన్షన్‌ నిర్మించాం. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించలేదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్‌ కోర్టు, ఏపీ లాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ 24-02-2014న ఓ ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇచ్చిందని వివరాలు తెలిపారు.

 ‘అమ్మ’కు మోహన్‌ లాల్‌ అండ్‌ టీమ్‌ రాజీనామా.. ఏం జరుగుతోంది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus