Jr NTR: ఆ సమయంలో తండ్రిగా నా ఫీలింగ్ చెప్పలేను.. తారక్ కామెంట్స్ వైరల్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  20 ఏళ్ల వయస్సులోనే మాస్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు ఆది, (Aadi)  సింహాద్రి (Simhadri) సినిమాలతో ఎన్నో సంచలనాలు సృష్టించారు. నందమూరి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నా టాలెంట్ తో తారక్ అంతకంతకూ ఎదిగి ప్రశంసలు అందుకోవడంతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా నిలిచారు. రికార్డ్ స్థాయిలో తారక్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా దేవర సినిమాతో మరికొన్ని గంటల్లో దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Jr NTR

అయితే తాను స్క్రిప్ట్ సెలక్షన్ లో మారడానికి కొడుకు అభయ్ రామ్ కారణమని చెప్పుకొచ్చారు. అభయ్ రామ్ పుట్టిన సమయంలో తండ్రిగా నా ఫీలింగ్ ను చెప్పలేనని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. కొడుకు పుట్టిన తర్వాతే నేనేంటో నాకు అర్థమైందని సినిమాల ఎంపికలో సైతం మారాల్సి వచ్చిందని తారక్ అభిప్రాయపడ్డారు. కరణ్ జోహార్ కు (Karan Johar) ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ ఈ విషయాలను చెప్పుకొచ్చారు.

దేవర (Devara) మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండే అవకాశం ఉంది. ఈ సినిమా సక్సెస్ కు టాక్ కీలకం కానుందని చెప్పవచ్చు. దేవర సినిమాకు యునానిమస్ హిట్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా సులువుగా 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. దేవర సినిమాలో యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

దేవర క్లైమాక్స్ ఈ సినిమా రేంజ్ ను డిసైడ్ చేయనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమాలో ట్విస్టులు సైతం ఊహించని విధంగా ఉండనున్నాయని తెలుస్తోంది. దేవర1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే దేవర2 సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

సుహాస్ దర్శకుడికి అలా కలిసొచ్చింది.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus