Prabhas: వాళ్లంతా వినయంగానే ఉంటారన్న ప్రభాస్.. చిరునవ్వే ఆయుధమంటూ?

  • June 28, 2024 / 01:05 PM IST

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)  సలార్ (Salaar) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాతో అంతకు మించిన హిట్ అందుకున్నారు. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలకు సంబంధించి అధికారికంగా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. స్టార్ హీరో ప్రభాస్ మితభాషి అనే సంగతి తెలిసిందే. ఇంటర్వ్యూలలో సైతం ప్రభాస్ అడిగిన ప్రశ్నలకు మాత్రమే జవాబిస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మూడు నిమిషాలు మాట్లాడితే చాలా ఎక్కువ సమయం మాట్లాడినట్లు ఫ్యాన్స్ ఫీలవుతారనే సంగతి తెలిసిందే.

స్టార్ హీరో ప్రభాస్ స్టార్ డమ్ రావడానికి కెరీర్ తొలినాళ్లలో ఎంతో కష్టపడ్డారు. ఈశ్వర్ (Eswar) , రాఘవేంద్ర (Raghavendra) సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా వర్షం సినిమాతో ఆయన సత్తా చాటారు. బాహుబలి (Baahubali) సిరీస్ సినిమాల కోసం ప్రభాస్ ఆరేళ్ల సమయం కేటాయించారు. బాహుబలి సక్సెస్ తర్వాత కూడా యంగ్, టాలెంటెడ్ దర్శకులకు పభాస్ ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నారు. చిరునవ్వే ప్రభాస్ ఆయుధం అని ఫ్యాన్స్ భావిస్తారు.

ప్రభాస్ బాల్యం కొంతమంది ఫ్రెండ్స్, బంధువుల మధ్య గడిచిపోయింది. బయటి వారిని చూసింది తక్కువ. అందువల్లే ప్రభాస్ కొత్త వాళ్ల ముందు, కొత్త ప్రదేశాలలో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరని తెలుస్తోంది. ఒక సందర్భంలో ప్రభాస్ మాట్లాడుతూ నాకంటే ఎక్కువ విజయాలు సాధించిన వాళ్లు సైతం వినయంగా ఉన్నారని చిరంజీవి, రజనీకాంత్ లాంటి వాళ్ల ముందు నేను చిన్నవాడినని ప్రభాస్ పేర్కొన్నారు.

ప్రభాస్ వెల్లడించిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం బాక్సాఫీస్ షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ పారితోషికం 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus