సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు తమ సినిమాల ద్వారా ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ మాస్ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టగా ఏఎన్నార్ మాస్ సినిమాలతో పాటు క్లాస్ సినిమాలపై కూడా దృష్టి పెట్టి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబినేషన్ లో 15 సినిమాలు తెరకెక్కాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన సినిమాలలో ఎవరు గొప్పగా చేశారనే చర్చ ఎప్పుడూ జరగలేదు. ఎందుకంటే అటు ఎన్టీఆర్ కానీ ఇటు ఏఎన్నార్ తమ పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నించారే తప్ప యాక్టింగ్ ద్వారా డామినేట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు.
కృష్ణుడి పాత్రలలో నటించడం ద్వారా ఎన్టీఆర్ కు ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు దక్కింది. అయితే ఒక సందర్భంలో ఏఎన్నార్ ను కృష్ణుడి వేషం వేయాలని ఎన్టీఆర్ కోరగా ఆ ప్రతిపాదనకు ఏఎన్నార్ అంగీకరించలేదని సమాచారం. ఈ రీజన్ వల్లే వాళ్లిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు నెలకొన్న సమయంలో కలిసి సినిమాలు చేయడానికి అటు ఎన్టీఆర్ కానీ ఇటు ఏఎన్నార్ కానీ ఆసకి చూపలేదని సమాచారం. సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్నార్ మధ్య దూరం పెరగడంతో ఇద్దరితో కలిసి పని చేసేవాళ్లు ఇబ్బంది పడ్డారని సమాచారం.
కొంతకాలం పాటు ఎన్టీఆర్ సినిమాలకు పని చేసే వాళ్లు ఏఎన్నార్ సినిమాలకు పని చేసేవారు కాదని ఏఎన్నార్ సినిమాలకు పని చేసేవారు ఎన్టీఆర్ సినిమాలకు పని చేసేవారు కాదని బోగట్టా. అయితే అలాంటి సమయంలో కూడా సినారె మాత్రం ఇద్దరి సినిమాలకు పని చేశారు. ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య విభేదాలు తొలగిపోయాయి.
ఇండస్ట్రీ కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్ చేసిన సేవలు అన్నీఇన్నీ కావు. పరిమితంగా రెమ్యునరేషన్ ను తీసుకొని ఎన్టీఆర్, ఏఎన్నార్ నిర్మాతల శ్రేయస్సు కోసం పని చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?