Naga Chaitanya: కస్టడీ కోసం చైతన్యను సెలెక్ట్ చేయడానికి ఆ సినిమానే కారణమా?

  • May 10, 2023 / 10:54 AM IST

తమిళ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వెంకట్ ప్రభు మొట్టమొదటిసారి నాగచైతన్య హీరోగా నటిస్తున్నటువంటి కష్టడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక నాగచైతన్య సైతం ఈ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నారు. వెంకట ప్రభు దర్శకత్వంలో తెలుగు తమిళ భాషలలో తెరకెక్కిన కస్టడీ సినిమా మే 12వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన తన వృత్తిపరమైన వ్యక్తిగత విషయాల గురించి కూడా వెల్లడించారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నాగచైతన్యను యాంకర్ ప్రశ్నిస్తూ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ మొదటి సినిమాకు మిమ్మల్ని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు నాగచైతన్య (Naga Chaitanya) సమాధానం చెబుతూ వెంకట్ ప్రభు గారు నేను నటించిన ఏ మాయ చేసావో సినిమా నుంచి మా జర్నీ మొదలైందని తెలిపారు. ఇక ఆయన ఎప్పటినుంచో ఓ తెలుగు సినిమా చేయాలని కోరుకుంటున్నారట. ఈ క్రమంలోనే నేను నటించిన లవ్ స్టోరీ సినిమా చూసి తనకు కష్టడి సినిమాలో అవకాశం కల్పించారని ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని నాగచైతన్య సమాధానం చెప్పారు.

ఇక తనకి కూడా తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఉందని,నేను మిమ్మల్ని తెలుగుకి తీసుకొస్తా.. నన్ను తమిళ్‌కి తీసుకెళ్లండి అని ఇద్దరు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల మా ఇద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుందని ఈ సందర్భంగా నాగచైతన్య చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమా నాగచైతన్యకు, డైరెక్టర్ వెంకట్ ప్రభుకి ఏ విధమైనటువంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus