టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ (Koratala Siva) ఒకరు కాగా మిర్చి (Mirchi) ‘శ్రీమంతుడు’ (Srimanthudu) , జనతా గ్యారేజ్ (Janatha Garage) , భరత్ అనే నేను (Bharath Ane Nenu) సినిమాలలో లవ్ స్టోరీని సైతం కొరటాల శివ అద్బుతంగా డీల్ చేశారు. అయితే ఆచార్య (Acharya) , దేవర సినిమాల విషయంలో మాత్రం లవ్ స్టోరీని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో కొరటాల శివ ఫెయిల్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమాలో లవ్ ట్రాక్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
కొన్ని సన్నివేశాల్లో వర పాత్ర గురించి పాజిటివ్ గా మరికొన్ని సన్నివేశాల్లో వర పాత్ర గురించి నెగిటివ్ గా జాన్వీ (Janhvi Kapoor) పాత్ర చేసిన కామెంట్లు ఆ పాత్రపై ప్రేక్షకుల్లో అభిప్రాయాన్ని మార్చేశాయి. జాన్వీ పాత్రకు సంబంధించిన కొన్ని డైలాగ్స్ సైతం ఫ్యాన్స్ కు నచ్చేలా, ఫ్యాన్స్ మెచ్చేలా లేకపోవడం గమనార్హం. జాన్వీ కపూర్ ఈ సినిమాలో తంగం అనే పాత్రలో కనిపించారు. జాన్వీ కపూర్ కోసమే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం ఉన్నారు.
మరోవైపు సినిమాలో దావూదీ సాంగ్ ను కట్ చేయడం ఫ్యాన్స్ ను ఒకింత నిరాశపరిచింది. జాన్వీ కపూర్ యాక్టింగ్ లో జీవం లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. జాన్వీ కపూర్ కు దేవరతో ఎంట్రీ ఒక విధంగా ప్లస్ అయినా ఆమె కెరీర్ కు ఈ సినిమా వల్ల పెద్దగా బెనిఫిట్ కలగదు. దేవర సీక్వెల్ ఏ విధంగా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది.
దేవర సినిమా తొలిరోజే 172 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్ మరీ భారీ టార్గెట్ కాకపోవడంతో చాలా ఏరియాలలో ఈ సినిమా సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.