Kalki: ఆ నవల స్పూర్తితోనే ప్రాజెక్ట్ కే మూవీ తెరకెక్కుతోందా?

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ప్రాజెక్ట్ కే మూవీ గ్లింప్స్ కు ఇప్పటివరకు 13 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ప్రాజెక్ట్ కే మూవీ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉండగా సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ సినిమాలుగా నిలుస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రాజెక్ట్ కే గ్లింప్స్ కు మహాభారతానికి లింక్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాకు (Kalki) కల్కి 2889 ఏడీ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ తాను పురాణాలను, సైన్స్ ఫిక్షన్ ను ఇష్టపడతానని అన్నారు. మహా భారతం, స్టార్ వార్స్ ను చూస్తూ పెరిగానని నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ రెండు ప్రపంచాలను కలిపే ప్రాజెక్ట్ కే సినిమాను చేయడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రాజెక్ట్ కే సినిమాకు డ్యూన్ అనే నవల స్పూర్తి అని సమాచారం అందుతోంది. ప్రపంచ దేశాల్లో తెరకెక్కిన ఎన్నో సినిమాలకు డ్యూన్ నవల స్పూర్తి అనే సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ కే సినిమా 800 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ప్రభాస్ వచ్చే ఏడాది రెండు లేదా మూడు సినిమాలను రిలీజ్ చేయనున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రెమ్యునరేషన్ 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus