Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు మైనస్ అవుతున్న మంచి లక్షణం ఇదే!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా హాజరు కాగా పార్ట్1 ఎపిసోడ్ కు అంచనాలకు మించి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎపిసోడ్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తుండగా మరో మూడు రోజుల్లో ప్రసారం కానున్న పార్ట్2 ఎపిసోడ్ కూడా రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంది. ఈ ఎపిసోడ్ ఏ సమయానికి స్ట్రీమింగ్ కానుందో తెలియాల్సి ఉంది.

అయితే పవన్ కు ఒక క్వాలిటీ మైనస్ అవుతోందని ఆ ఒక్క విషయంలో పవన్ మారితే ఆయన కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయని ఆయన పార్టీకి కూడా మేలు జరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అన్ స్టాపబుల్ పార్ట్1 లో తన పెళ్లిళ్ల గురించి వచ్చిన విమర్శలపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. నేను కావాలని మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని అది అలా జరిగిపోయిందని పవన్ చెప్పుకొచ్చారు.

రాజకీయాలలో సొంతవాళ్లను కూడా అనుమానించాల్సి ఉంటుందని అయితే ఆ గుణం తనలో లేదని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ అందరినీ నమ్మకూడదని పవన్ కు మంచితనం ఎక్కువగా ఉండటం, తప్పు చేసిన వాళ్ల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించకపోవడం మైనస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ ఈ విషయంలో మారాలని జాలి, దయ కొన్ని సందర్భాల్లో పనికిరావని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా 60 శాతానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. హరిహర వీరమల్లు సినిమా పవన్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలవడంతో పాటు పవన్ అభిమానులకు కచ్చితంగా నచ్చుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ పారితోషికం 60 కోట్ల రూపాయలకు ఉండగా రాబోయే రోజుల్లో పవన్ పారితోషికం 100 కోట్ల రూపాయలకు చేరే ఛాన్స్ ఉంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus