బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం ఎలిమినేషన్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యేలోపు తమ ఫేవరెట్ కంటెస్టెంట్ కాపాడుకోవాలని చూస్తున్నారు బిగ్ బాస్ ఆడియన్స్. అయితే, ఈసారి డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా షాకింగ్ ఎలిమినేషన్ తప్పేలా లేదు. ఎందుకంటే., ఈసారి మొత్తం మీదు 8మంది హౌస్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లలో ఇద్దరు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. వీళ్లలో ఎవరైనా వెళ్లిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. అమ్మాయిలు ఇద్దరూ అశ్విని ఇంకా రతిక అన్ అఫీషియల్ సైట్స్ లో బోటమ్ లో ఉన్నారు.
లెక్క ప్రకారం అయితే వీళ్లిద్దరే ఎలిమినేట్ అవ్వాలి. కానీ, ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని ఎలిమినేట్ చేస్తారనే అనిపిస్తోంది. అలా అయితే డేంజర్ జోన్ లో ఈసారి చాలామందే ఉన్నారు. అన్ అఫీషియల్ సైట్స్ లో ఒక్కసారి ఓటింగ్ ని పరిశీలిస్తే.., రైతుబిడ్డ ప్రశాంత్ ఓటింగ్ లో ప్రభంజనం సృష్టిస్తున్నారు. దాదాపుగా 30 పర్సెంట్ పైనే ఓటింగ్ ని కైవసం చేసుకుంటున్నాడు. ఇంత హ్యూజ్ గా ఓటింగ్ మరెవ్వరికీ లేదు. ఆ తర్వాత శివాజీకి , అమర్ కి కూడా ఓటింగ్ అనేది బాగానే జరుగుతోంది.
ఇద్దరికీ దాదాపుగా 20శాతం పైనే ఓటింగ్ జరుగుతోంది కాబట్టి వీరిద్దరూ కూడా సేఫ్ జోన్ లో ఉంటే అవకాశం ఉంది. వీళ్ల ముగ్గురూ అయితే సేఫ్ గానే ఉన్నారు. ఇక మిగిలిన ఐదుగురులో నుంచే డబుల్ ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. ఇందులో గౌతమ్, అర్జున్, యావర్, అశ్విని, ఇంకా రతిక ఉన్నారు. అర్జున్ , గౌతమ్ అందరికంటే లీస్ట్ లో కనిపిస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు అలాగే అశ్విని ఇంకా రతిక ఇద్దరిలో ఒకరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఇక్కడే బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు.
పల్లవి ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ ఫ్రీపాస్ ఉంది కాబట్టి ఇది ఎవరికి వాడతాడు అనేది సస్పెన్స్ గానే ఉంటుంది. ఒకవేళ తనకే వాడుకోవాలి అని అనుకుంటే ఈవారం తనని లాస్ట్ వరకూ సేవ్ చేయకుండా ఉంచుతారు. యావర్ – ప్రశాంత్ ఇద్దరూ ఉండి ఇద్దరిలో ఎవరికి వాడతావ్ అని అడిగితే యావర్ కి వాడకపోతే యావర్ కూడా ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ఈసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది డబుల్ ఎలిమినేషన్ లో కీలక పాత్ర పోషించబోతోంది. అందుకే, ఈవారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉందని (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదీ మేటర్.