Bigg Boss Telugu 6: ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు ? సీక్రెట్ రూమ్ లో ఉండేది ఎవరు ? డిటైల్స్ ఇవే..!

బిగ్ బాస్ హౌస్ లో ఆరోవారం ఎలిమినేషన్స్ అత్యంత ఆసక్తికరంగా జరగబోతున్నాయి. వీకండ్ స్పాన్సర్ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ రామ్ రాజ్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ టాస్క్ ఆడారు. ఇందులో శ్రీహాన్ టీమ్ విన్నర్స్ గా నిలిచారు. దీని తర్వాత వీకండ్ ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ కి ఫుల్ క్లాస్ పీకినట్లుగా సమాచారం తెలుస్తోంది. అంతేకాదు, ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతోందని సమాచారం. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఒకరిని సీక్రెట్ రూమ్ లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి.

గత కొన్ని సీజన్స్ గా సీక్రెట్ రూమ్, ఫేక్ ఎలిమినేషన్స్ , వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరగడం లేదు. అయితే, ఈసారి మాత్రం సీక్రెట్ రూమ్ ని రెడీ చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం నామినేషన్స్ లో తొమ్మిది మంది ఉన్నారు. వీళ్లలో శ్రీహాన్, ఆదిరెడ్డి, గీతు ముగ్గురు సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక మిగిలిన వాళ్లలోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. వీళ్లలో శ్రీసత్య, మెరీనా, కీర్తి, రాజ్, బాలాదిత్య, సుదీప, ఉన్నారు. వీళ్లలో ఇప్పుడు ఇద్దరు ఎలిమినేట్ కాబోతున్నారు. అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే,

శ్రీహాన్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. దాదాపుగా 20శాతం వరకూ ఓటింగ్ ని ప్రభావితం చేశాడు. చాలా సైట్స్ నిర్వహించిన పోల్స్ లో శ్రీహాన్ టాప్ లోనే ఉన్నాడు. అలాగే, ఆదిరెడ్డి ఇంకా గీతు ఇద్దరూ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. వీళ్లకి కూడా 14 పర్సెంట్ వరకూ ఓటింగ్ అనేది జరిగింది. ఇక మిగతా వాళ్ల అందరూ కూడా డేంజర్ జోన్ అనే చెప్పాలి. అందరికీ ఈక్వల్ గా 8 నుంచీ 9 పర్సెంట్ వరకూ ఓటింగ్ అనేది జరిగింది. శ్రీసత్య, కీర్తి ఇద్దరూ సేఫ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ ఆరుగురిలో చూస్తే వీరిద్దరికీ ఓటింగ్ కొద్దిగా పర్వాలేదని అనిపించింది. తర్వాత రాజ్, సుదీప, బాలాదిత్య ఇంకా మెరీనాలు నలుగురులో ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో చూస్తే సుదీప అందరికంటే లీస్ట్ లో ఉంది. అలాగే కొన్ని చోట్ల మెరీనా లీస్ట్ లో ఉంది. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజ్ కూడా సేఫ్ గా ఉన్నాడని చెప్పలేని పరిస్థితి.

చాలా రోజులు రాజ్ లిస్ట్ లో లీస్ట్ లోనే ఉన్నాడు. రాజ్ కి కూడా ఎలిమినేషన్ గండం ఉంది. ఒకవేళ రాజ్ ఎలిమినేట్ అయిపోతే సీక్రెట్ రూమ్ లో ఎవరుంటారంటే., ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ జరిగితే బాలాదిత్యని సీక్రెట్ రూమ్ లో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, బాలాదిత్య అందరి గేమ్ ని అబ్జర్వ్ చేసుకుని తన గేమ్ ని మార్చుకోవడానికి ఈ సీక్రెట్ రూమ్ బాగా ఉపయోగపడుతుంది. మరి ఈవారం బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనేది ఆసక్తికరం.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus