ఒకే శుక్రవారంపై ఆధారపడ్డ ముగ్గురు నితిన్..ల కెరీర్..!

అవును ఈ వారం ముగ్గురు నితిన్ (Nithiin)..లకి చాలా కీలకంగా మారింది. అదెలా అంటారా.. కొంతమందికి ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. ఇంకొంతమంది కోసం విషయంలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా యూత్ స్టార్ గా పిలవబడే నితిన్ గురించి చెప్పుకుందాం. ‘మాచర్ల నియోజకవర్గం'(Macherla Niyojakavargam) ‘ఎక్స్ట్రా'(Extra Ordinary Man)వంటి ఫ్లాపుల తర్వాత ‘రాబిన్ హుడ్’ (Robinhood) గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నితిన్. తనకు ‘భీష్మ’ (Bheeshma) వంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల (Venky Kudumula) దీనికి దర్శకుడు. శ్రీలీల (Sreeleela)  హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా నటించాడు.

Nithiin

5 నిమిషాలు కనిపించే పాత్రలో అతను నటించాడు. అయినప్పటికీ ఎస్.ఆర్.హెచ్ ఫ్యాన్స్ కచ్చితంగా అతని కోసమైనా సినిమాకి వెళ్ళి చూసే అవకాశం ఉంది. మార్చి 28న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దీనిపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కచ్చితంగా తనకు హిట్ ఇస్తుంది అనే ధీమాతో ప్రమోషన్స్ వంటి వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నాడు.

ఇక మార్చి 28నే ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది అయిన నార్నె నితిన్ (Narne Nithin) కూడా ‘మ్యాడ్ స్క్వేర్’  (Mad Square) తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇప్పటికే ‘మ్యాడ్’ (MAD)  ‘ఆయ్’ (AAY) వంటి హిట్లతో ఇతను హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘మ్యాడ్ స్క్వేర్’ కనుక హిట్ అయితే.. ఇతను హ్యాట్రిక్ కొట్టినట్టే..! సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈరోజుల్లో ఒక హీరో హ్యాట్రిక్ కొట్టడం అనేది చిన్న విషయం కాదు. ఇతనికి ఆ అదృష్టం ఉందో.. లేదో ఈ వారమే తేలిపోద్ది.

అలాగే ‘మ్యాడ్ స్క్వేర్’ లో ఇంకో నితిన్ కూడా నటించాడు. అతనే రామ్ నితిన్..! (Ram Nithin) ‘మిస్టర్ పెళ్ళాం’ వంటి కామెడీ సిరీస్లతో ఇతను కెరీర్ ప్రారంభించాడు. అయితే ‘మ్యాడ్’ లో మనోజ్ పాత్ర ఇతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కానీ తర్వాత ఇతని నుండి మరో సినిమా రాలేదు. ‘మ్యాడ్ స్క్వేర్’ కనుక హిట్ అయితే.. ఇతను వరుస అవకాశాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus