బిగ్ బాస్4: ఎలిమినేట్ అయ్యేది ఆయనే..!

బిగ్ బాస్ హౌస్ లో ఈసీజన్ లో ఎలిమినేషన్ అనేది ఫెయిర్ గా జరగడం లేదని సోషల్ మీడియాలో ఎంత మొత్తుకుంటున్నా కూడా బిగ్ బాస్ టీమ్ మాత్రం చేసేదే చేస్తున్నారు. వాళ్లకున్న క్లారిటీతోనే ముందుకు వెళ్తున్నారు. నిజానికి లాస్ట్ వీక్ అంటే 7వ వారం సమంత యాంకరింగ్ చేస్తోంది కాబట్టి, పైగా దసరా పండగ కాబట్టి ఎలిమినేషన్ లేదనే అనుకున్నారు. కానీ, దివిని ఎలిమినేట్ చేసింది సమంత. అలాగే, ఈవీక్ కూడా ఎలిమినేషన్ ఉండదనే వార్తలు వినిపిస్తున్నా కూడా అమ్మరాజశేఖర్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వక తప్పదు అనే ప్రిడిక్షన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

గతవారం అమ్మరాజశేఖర్ హాఫ్ షేవ్ చేస్కుని నామినేషన్స్ తప్పించుకున్నాడు కాబట్టి , ఎలిమినేషన్స్ లిస్ట్ లో లేడు. అందుకే సమంత నో ఎలిమినేషన్ అని చెప్పే, ఆయన గుండు చేయించుకుని సేఫ్ అయినదానికి అర్ధం లేకుండా పోతుంది. అంతేకాదు, దానిపైన కూడా విపరీతమైన ట్రోల్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ వీక్ ఎలిమినేషన్ అనేది పెట్టారు. అయితే, మరి ఈవారం ఎలిమినేషన్ ఉంటుందా ? ఉండదా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఈవీక్ కాకుండా వచ్చే 10వ వారం అంటే దీపావళి రోజు వస్తుంది కాబట్టి అప్పుడు ఎలిమినేషన్ తీసేస్తారని అందుకే ఈవారం ఖచ్చితంగా ఎలిమినేషన్స్ ఉంటాయనే చెప్తున్నారు. సో, దీన్నిబట్టీ చూస్తుంటే ఈవారం అమ్మరాజశేఖర్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వక తప్పదనే అనిపిస్తోంది.

లాస్ట్ వీక్ ఆయన చేయించుకున్న గుండు ఆయన్ని కాపాడింది. మరి ఈవారం కాపాడేందుకు ఎవరు ఉన్నారు అనేది ఆసక్తికరం. అంతేకాదు, అమ్మరాజశేఖర్ మాస్టర్ తో పాటు డేంజర్ జోన్ లో మెహబూబ్, అండ్ మోనాల్ ఇద్దరూ ఉన్నారు. సో వాళ్లలో ఎవరినైనా బిగ్ బాస్ టీమ్ ఎలిమినేట్ చేయాలని అనుకుంటే అమ్మ సేఫ్ అవుతారు. లేదంటే ఎలిమినేట్ అయ్యేది ఈవారం ఆయనే. మరి చూద్దాం.. ఏం జరగబోతోంది అనేది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus