This Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు..!

ఈ మధ్య కాలంలో ప్రతీవారం థియేటర్లను డామినేట్ చేస్తూనే ఉన్నాయి ఓటీటీలు. థియేటర్లలో 3,4 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఓటీటీలో 10 సినిమాల వరకు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలకి టాక్ తేడాగా వస్తే ఓటీటీలనే జనాలు ప్రిఫర్ చేస్తున్నారు. కొంతమంది థియేటర్లలో చూసినా లేదా మిస్ అయినా కూడా ఓటీటీల్లో చూసేవారు ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. గత వారం ‘ది వారియర్’ తో సహా ‘గార్గి’ ‘మై డియర్ భూతం’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ‘ది వారియర్’ కు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కొంతమేర బాగానే కలెక్ట్ చేసింది. కానీ సాయి పల్లవి ‘గార్గి’, ప్రభుదేవా ‘మై డియర్ భూతం’ చిత్రాలకు అసలు జనాలే లేరు.అందుకు కారణం వర్షాలే అని చెప్పాలి. దీంతో ‘ఆహా’ వంటి ఓటీటీ లో రిలీజ్ అయిన ‘సమ్మతమే’ వంటి సినిమాలే ప్రేక్షకులకు దిక్కయ్యాయి.

ఈ వారం కూడా ఏకంగా 10 సినిమాల వరకు రిలీజ్ అవుతున్నాయి. కొన్ని ఓటీటీల్లో కాగా మరికొన్ని థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) థాంక్యూ : నాగ చైతన్య హీరోగా రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థాంక్యూ’. జూలై 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్లు బాగున్నాయి. నిర్మాత దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.

2) దర్జా: ‘జబర్దస్త్’ హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో సునీల్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘దర్జా’. జూలై 22 నే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేర అలరిస్తుందో చూడాలి.

3) మహా: చాలా వివాదాలతో పాపులర్ అయిన ఈ తమిళ సినిమా కూడా జూలై 22నే థియేటర్లలో విడుదల కాబోతుంది. హన్సిక ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీ ఆమె కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. జమీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో, హన్సిక మాజీ ప్రియుడు అయిన శింబు కూడా కీలకపాత్ర పోషించాడు.

4) మీలో ఒకడు : కుప్పిలి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 22న విడుదల కాబోతుంది.

5) షంషేరా: రణబీర్ హీరోగా దర్శకుడు కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 22నే విడుదల కాబోతుంది. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ అదే రోజున రిలీజ్ కాబోతుండడం విశేషం. వాణీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. సంజయ్ దత్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

6) హై ఫైవ్‌: చాలా గ్యాప్ తర్వాత అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. మన్నార చోప్రా, సుధీర్, సమీర్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ కూడా జూలై 22నే విడుదల కాబోతుంది.

7) జగన్నాటకం: పార్వతీశం, కుమారస్వామి, స్వాతి మండల్‌ అర్ఫితా లోహి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆరజ్‌ అల్తాడ దర్శకత్వం వహించాడు. జూలై 22 న ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

8) ‘ఎఫ్3’: వెంకటేష్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.థియేటర్లలో అలరించిన ఈ సినిమా జూలై 22నుండి నెట్‌ఫ్లిక్స్‌, సోనిలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

9) ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌: ‘బిగ్ బాస్’ ఫేమ్ షణ్ముఖ్ టైటిల్ రోల్ పోషించిన ఈ వెబ్ సిరీస్ జూలై 22 నుండి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.

10) పరంపర 2: నవీన్ చంద్ర, శరత్ కుమార్ జగపతి బాబు ల ‘పరంపర’ సీజన్ 1 సక్సెస్ అయ్యింది. సీజన్ 2 జూలై 21 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

11) ది గ్రే మ్యాన్: హాలీవుడ్లో ధనుష్ నటించిన మరో మూవీ ది గ్రే మ్యాన్ తెలుగు వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో జూలై 22 నుండి స్ట్రీమింగ్ కానుంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus