This Weekend Movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్..!

సెప్టెంబర్లో పెద్ద సినిమాల రిలీజ్ లు లేకపోవడంతో మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు క్యూలు కడుతున్నాయి. సెప్టెంబర్ మొదటి శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు ఆకట్టుకోలేదు. కానీ సెప్టెంబర్ 9న రిలీజ్ అయిన ‘బ్రహ్మాస్త్రం’ ‘ఒకే ఒక జీవితం’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించాయి. ఈ శుక్రవారం అంటే సెప్టెంబర్ 16న కూడా కొన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇవి కూడా అంతో ఇంతో అంచనాలు క్రియేట్ చేసిన సినిమాలే..! అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి : ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. కచ్చితంగా ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ప్రేక్షకులకు ఈ మూవీ ఫస్ట్ ఛాయిస్ గా మారే అవకాశాలు ఉన్నాయి.

2) శాకిని డాకిని : నివేదా థామస్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాని డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించాడు. సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కచ్చితంగా ప్రేక్షకులను అలరించేలా ఈ మూవీ ఉంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 16 నే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

3) నేను మీకు బాగా కావాల్సిన వాడిని : యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న మూవీ ఇది. శ్రీధర్ గదే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మించారు. సెప్టెంబర్ 16 నే ఈ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది.

4) కె3 కోటికొక్కడు : కన్నడ స్టార్ కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన ఈ మూవీని శివ కార్తిక్‌ దర్శకత్వం వహించాడు. ‘గుడ్ సినిమా గ్రూప్’ బ్యానర్ పై ‘శ్రేయాస్‌ శ్రీనివాస్‌’, ‘దేవేంద్ర డీకే’ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపు 60 కోట్ల పైన వసూళ్ళు రాబట్టింది. సెప్టెంబర్ 16న తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. మరి ఈ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

5) సకల గుణాభి రామ : ‘బిగ్ బాస్ 5’ విన్నర్ వి జె సన్నీ, అషిమా హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వంలో సంజీవ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘సకల గుణాభి రామ’. సెప్టెంబర్ 16 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

6) అం అః : ‘రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌’, ‘శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్’ బ్యాన‌ర్స్‌ పై జోరిగె శ్రీనివాస్ రావు నిర్మించిన ఈ చిత్రానికి శ్యామ్ మండ‌ల దర్శకత్వం వహించారు.సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సందీప్ కుమార్ కంగుల‌ సంగీతం అందించారు. సెప్టెంబర్ 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీ లో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

7) కిరోసిన్ : ‘బిగ్ హిట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ధృవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 16 నుండీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

8) కాలేజ్ రొమాన్స్ : ఈ సిరీస్ సోనీ లివ్ లో సెప్టెంబర్ 16 నుండి స్ట్రీమింగ్ కానుంది.

9) విక్రాంత్ రోణ : సుదీప్ హీరోగా రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘విక్రాంత్ రోణ’ సెప్టెంబర్ 16 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

10) దహన్ : ఈ హిందీ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 16 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

11) జోగి : ఈ హిందీ సినిమా సెప్టెంబర్ 16 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

12) రామారావు ఆన్ డ్యూటీ :

రవితేజ నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 15 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus