కీర్తి రెడ్డి… ‘తొలిప్రేమ’ సినిమా చూసిన వాళ్ళు ఈమెను అంత ఈజీగా మైండ్లో నుండి డిలీట్ చేయలేరు. ఈమె తెలుగమ్మాయే..! హైదరాబాద్లో జన్మించింది. కీర్తి రెడ్డి తల్లి ఓ డిజైనర్(డ్రెస్), తాత గడ్డం గంగారెడ్డి నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం మాజీ ఎంపీ.అయితే కీర్తి రెడ్డి చదువుకుంది మాత్రమే బెంగళూరులో.! 8 సంవత్సరాల వయసులోనే భరత నాట్యంలో శిక్షణ పొందిన కీర్తి రెడ్డి ఉన్నత చదువులు విదేశాల్లో పూర్తి చేసింది.
ఇదిలా ఉండగా.. ‘తొలిప్రేమ’ లో ఈమె పోషించిన అను పాత్ర అందరికీ కనెక్ట్ అయ్యింది. కరుణాకరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఓ చిచ్చుబుడ్డి వెలుగులో నుండి పాదాలు, నడుము ఆ తర్వాత హీరోయిన్ మొహం దేవతలా కనిపిస్తుంది. ఇంకో 4,5 దశాబ్దాల వరకు కీర్తి రెడ్డి హీరోయిన్ ఎంట్రీ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ‘తొలిప్రేమ’ తో కీర్తి రెడ్డి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో ఈమెకు అవకాశాలు లభించాయి.
అయితే కీర్తి రెడ్డి మొదటి చిత్రం మాత్రం ‘తొలిప్రేమ’ కాదు. అవును పవన్ కళ్యాణ్.. కీర్తి రెడ్డి మొదటి హీరో కాదు. అవును.. నిజానికి అలీ .. కీర్తి రెడ్డి మొదటి హీరో. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1996 వ సంవత్సరంలో వచ్చిన ‘గన్ షాట్’ మూవీ కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా. ఎస్వీ కృష్ణారెడ్డికి… కీర్తి రెడ్డి దూరపు బంధువు. అందుకే ఆమెను హీరోయిన్ గా లాంచ్ చేశాడు.
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ సైకో పాత్రలో నటించి మెప్పించాడు. సినిమా అయితే టైం పాస్ గా చూడొచ్చు. కానీ ఆ టైంలో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా మిగిలింది. అయితే ఈ సినిమా తర్వాత కీర్తి రెడ్డికి అవకాశాలు రాలేదు. రెండేళ్ల తర్వాత ‘తొలిప్రేమ’ లో పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించింది. విచిత్రం ఏంటి అంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ పాత్రలో అలీ కూడా నటించాడు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?