Baby Movie: బేబీ మూవీ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యుస్ ఇదే!

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిన్న సినిమాలకు ఆశించిన స్థాయిలో థియేటర్లు కూడా దొరకడం లేదు. అయితే బేబీ మూవీ చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది. బేబీ సినిమా నిడివి మూడు గంటలు అయినా ప్రేక్షకులకు బోర్ కొట్టలేదు. అయితే ఈ సినిమా నిడివి మరింత పెరగనుందని సమాచారం అందుతోంది. 14 నిమిషాల ఫుటేజ్ ను యాడ్ చేయనున్నారని ఈ సినిమాలో కొత్త సీన్లను, సాంగ్ ను యాడ్ చేయడం వల్ల బేబీ సినిమాను ఇప్పటికే చూసిన వాళ్లు సైతం ఈ సినిమాను మళ్లీ చూడటానికి ఆసక్తి చూపించే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

బేబీ మూవీ ఫ్యాన్స్ కు ఇది అదిరిపోయే తీపికబురు అనే చెప్పాలి. బేబీ మూవీ ఇప్పటికే పెట్టిన పెట్టుబడికి ఐదు నుంచి ఆరు రెట్ల ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకుంది. అదే సమయంలో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా మంచి లాభాలను అందిస్తోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య తమ పాత్రలలో జీవించారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బేబీ మూవీ నిజ జీవితంలో జరిగిన కొన్ని ఘటనల స్పూర్తితో తెరకెక్కింది.

బేబీ మూవీ సక్సెస్ తో స్టార్ హీరోలు సైతం సాయి రాజేశ్ డైరెక్షన్ లో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. సాయి రాజేశ్ బేబీ మూవీకి 2 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా సక్సెస్ తో సాయి రాజేశ్ తో సినిమాలు తీయడానికి చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

సాయి రాజేశ్ పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బేబీ సినిమా సక్సెస్ తో చాలామంది సాయి రాజేశ్ అభిమానులుగా మారిపోయారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus