టాలీవుడ్ లో డైలాగ్ రైటెర్స్ చాలా మంది ఉన్నారు..అయితే వారిలో ఒక్కొక్కరూ ఒక్కో రకం అని చెప్పాలి….ఒకరు క్యామిడీ బాగా రాస్తే మరొకరు సెంటిమెంట్, ఇంకొకరు పంచ్ డైలాగ్స్ ఇలా ఎవరికి వారు తమ తమ ట్యాలెంట్స్ తో ఇరగదీస్తున్నారు…అయితే అదే క్రమంలో ఇప్పుడు మన టాలీవుడ్ లో ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తున్న పేరు “సాయిమాధవ్ బుర్రా”. ఈ డైలాగ్ రైటర్ అదృష్టం ఏమిటి అంటే…ఆయన రెండు ప్రతిష్టాత్మక సినిమాలకు ఒకేసారి డైలాగ్స్ రాయడం….అందులో ఒకటి మన చరిత్రను మనకు చూపించిన బాలయ్య 100వ సినిమా కాగా, మరొకటి చిరు 150వ సినిమా….ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల విషయంలో ఆసినిమాలో డైలాగ్స్ కు అదిరిపోయే ప్రశంసలు అందుకుంటున్నారు సాయిమాధవ్ బుర్రా….అందులో కొన్ని అయితే అసలు మరచిపోలేను అని అంటున్నారు.
అవేమిటంటే…..ఒకటి సీతారామశాస్త్రి గారిది, రెండు ఒక పెద్దాయనది….ఆ వివరాల్లోకి వెళితే…ముంబై లో ప్రీవ్యూ చూసిన తరువాత…ముంబై ఏర్‌పోర్ట్ లో నన్ను ఒకసారి దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నారు. తర్వాత భుజం తట్టారు. ఇక పద అన్నారు. అంతకుమించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నన్ను హత్తుకునేటపుడు ఆయన కళ్లల్లో ఒక మెరుపు చూశాను. అది చాలు ఈ జీవితానికి అనిపించింది అని అంటున్నారు సాయిమాధవ్. ఇక చిరు 150 గురించి అయితే..ఒక కొత్త వ్యక్తి నాకు ఫోన్ చేశారు. తన మనవడి నుంచి నంబర్ తీసుకున్నట్లు చెప్పాడు. అతను ఎక్కడెక్కడో ప్రయత్నించి నా నంబంర్ సంపాదించాడట. ఈ సినిమాలో రైతుల కష్టాల గురించి రాసిన డైలాగులకు కదిలిపోయానంటూ చాలా ఉద్వేగంగా మాట్లాడాడు ఆయన అంటున్నాడు సాయి మాధవ్….ఇలా తాను మరచిపోలేని అనుభూతులను మీడియాకు తెలిపాడు సాయిమాధవ్….
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.