Bheemla Nayak: పవన్ మూవీ కోసం అలా చేసిన త్రివిక్రమ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో త్రివిక్రమ్ మాటలు అందిస్తూ భీమ్లా నాయక్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్ కానున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. లుంగీ కట్టుకుని టీజర్ లో పవన్ చెప్పిన డైలాగులు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా థియేటర్లు మారుమ్రోగేలా ఈ సినిమా డైలాగ్స్ ఉంటాయని సమాచారం. త్రివిక్రమ్ తన కలానికి పదును పెట్టి భీమ్లా నాయక్ సినిమాలో డైలాగులు ప్రత్యేకంగా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యామీనన్ ఈ సినిమాలో నటిస్తుండగా రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లేతో పాటు మాటలు కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే.

నాగదేవర సూర్యవంశీ నిర్మాతగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. 2022 సంవత్సరం జనవరి 12వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. త్వరలో రానాకు సంబంధించిన టీజర్ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus