Prabhas: నరికేస్తాం అంటూ వార్నింగ్.. అసలు ఏమి జరిగిందంటే!

టాలీవుడ్ నుండి మొట్టమొదటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ఎవరు అంటే అందరి నోటి నుండి కామన్ గా వచ్చే పేరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తో ఆయన రేంజ్ ఎవ్వరూ కలలో కూడా ఊహించని రేంజ్ కి వెళ్ళింది. తనతో పాటు టాలీవుడ్ లెవెల్ ని కూడా పెంచాడు. ఈ సినిమా తర్వాత ఆయన నుండి వచ్చిన మూడు సినిమాలు అట్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.

కానీ కలెక్షన్స్ మాత్రం మన స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలకంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఫ్లాప్ సినిమాలు పడితేనే ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే, ఇక సూపర్ హిట్ సినిమా తీస్తే ఏ రేంజ్ ఉంటుందో అని ట్రేడ్ పండితులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా సలార్ అవుతుందని ఆశిస్తున్నారు . ఇదంతా పక్కన పెడితే సినిమాలే లోకం గా భావిస్తున్న ప్రభాస్ కి కొంతమంది రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

ఆయన (Prabhas) పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారు బీజేపీ పార్టీ లో ప్రధాన నాయకుడిగా ఎన్నో రోజులు కొనసాగాడు. మంత్రి గా కూడా పని చేసాడు, ఆ పార్టీ కోసం ప్రభాస్ అప్పట్లో ప్రచారానికి రాబోతున్నాడని వార్త వచ్చిందట. ఈ వార్త వైరల్ అవ్వడం తో ప్రతిపక్ష పార్టీ కి సంబంధించిన ఒక ముఖ్య నేత ప్రభాస్ కి ఫోన్ చేసి బెదిరింపులు చేసాడట. ఏంటి ఎన్నికల ప్రచారానికి వస్తున్నావు అట?, సంతోషంగా సినిమాలు చేసుకుంటున్నావు,

అలాగే కొనసాగొచ్చు కదా, నీకెందుకు రాజకీయాలు, వేలు పెడితే నరికేస్తాం జాగ్రత్త ‘ అని అన్నాడట. దానికి ప్రభాస్ సమాధానం చెప్తూ ‘ అసలు నాకు పాలిటిక్స్ అంటే ఏంటో కూడా తెలియదు, నువ్వు చెప్తే కానీ నాకు ఈ విషయం తెలియదు. నాకు రావాలని ఆసక్తి కూడా లేదు, నువ్వు ఇలా బెదిరింపులు చేస్తే నాకు రావాలని అనిపిస్తాది, ఏమి పీకుతావో అప్పుడు చూద్దాం, కాబట్టి నన్ను గెలకకు’ అని అన్నాడట.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus