బాహుబలి కంక్లూజన్ వెయ్యికోట్లను వసూలు చేసి 1500 కోట్ల మార్క్ ని చేరుకోవడానికి పరుగులు తీస్తోంది. ఇది మూడు తరాల కథ మాత్రమే కాదు.. ఈ చిత్రం రూపుదిద్దుకోవడానికి కూడా మూడు తరాల వారు పనిచేశారు. విజయేంద్ర ప్రసాద్ బాహుబలి కథను అందించారు. అతని తనయుడు రాజమౌళి దర్శకుడిగా వెండితెరపై ఆ కథను ఆవిష్కరించారు. ఇక రాజమౌళి కొడుకు కార్తికేయ.. ‘బాహుబలి’ రెండు పార్ట్‌లకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఇలా రాజమౌళి ఫ్యామిలీ మూడు తరాల వారు ఈ సినిమా కోసం పనిచేశారు.
అంతేకాదు రాజమౌళి పెదనాన్న కుటుంబానికి చెందిన మూడుతరాల వారు కూడ బాహుబలి మేకింగ్ లో భాగం పంచుకున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకుడుగా పనిచేశారు. కీరవాణి తండ్రి శివశక్తి దత్త పాటలు రాశారు. ఆ పాటలను కీరవాణి కుమారుడు కాలభైరవ ఆలపించాడు. వీరితో పాటు రాజమౌళి కుటుంబంలోని ఇతర సభ్యులు రమా రాజమౌళి, వల్లి, కళ్యాణ్ కోడూరి, సింహా కోడూరి, రామకృష్ణ కోడూరి, రాజా కోడూరిలు ఐదేళ్లపాటు శ్రమించి కళాఖండాన్ని మనకి అందించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.