Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్ ఇతర హీరోలు చేస్తేనా?
- September 10, 2026 / 08:40 PM ISTByFilmy Focus Desk
ఒక స్టార్ హీరో నుండి ఒక సినిమా వస్తే అదే క్యాలెండర్‌లో మరో సినిమా రాని పరిస్థితి మన టాలీవుడ్‌లో ఉంది. నిన్నటి నిన్న స్టార్ హోదా అందుకున్న హీరోలు కూడా ఇలా చేస్తున్నారు. మహా అయితే రెండో సినిమా చేస్తున్నారు. అంతే కానీ మూడో సినిమాకు రెడీ అవ్వడం లేదు. అలాంటిది ఒక స్టార్ హీరో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. అందులోనూ ఆరు నెలల గ్యాప్‌లోనే అంటే ఆశ్చర్యమే కదా. అందులోనూ ఆ సినిమా ఒక్కోటి ఒక్కో జోనర్‌లో అని తెలుసా?
Suriya
ఈ ఫీట్ చేస్తున్న హీరో ఎవరో కాదు.. ‘ది వన్’ సూర్య. ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది. ఆ సినిమాలేంటి.. ఎప్పుడు వచ్చాయి.. ఎంత వసూళ్లు సాధించాయి. మొన్నటిదాకా వరుస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్‌లో పడేలా చేసుకున్న సూర్య ఇప్పుడు మామూలు కంబ్యాక్ ఇవ్వలేదు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్లు కొడుతున్నాడు. ‘కరుప్పు’ / ‘వీరభద్రుడు’ సినిమాతో రూ. 300 కోట్లకుపైగా వసూలు చేశాడు.

ఆ తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో రూ. 200 కోట్లకుపైగా వసూలు చేశాడు. ఈ రెండు సినిమాలు పూర్తిగా డిఫరెంట్ జోనర్లలో రూపొందాయి. ఇప్పుడు మరోసారి డిఫరెంట్ జోనర్లో సినిమాను ఓకే చేశాడు. ఓకే చేయడం కాదు.. ఏకంగా సినిమాను రెడీ చేస మరో రెండు నెలల్లో రిలీజ్ చేయబోతున్నాడు. ఈ మేరకు సినిమాను ప్రకటించారు. అదే ‘సీన్’. జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పోలీస్ డ్రామా టీజర్ అదిరిపోయింది.
యునిఫామ్ వేసుకోకుండా షార్ట్, టీషర్ట్ వేసుకుని జైల్లో, డిపార్ట్‌మెంట్‌లో ఒక్కొక్కరు తన గురించి విచిత్రంగా ఆలోచించేలా చేసుకునే ఒక పోలీస్ ఆఫీసర్ కథ ఈ సినిమా. సెటప్ చూస్తుంటే మరోసారి సూర్య వంద కోట్ల రూపాయల క్లబ్‌లోకి వచ్చేలానే ఉందీ సినిమా. దీంతో ఆరు నెలల గ్యాప్‌లోనే మూడు సినిమాలూ రానున్నాయి. ఈ సినిమాను నవంబర్ 6న తీసుకొస్తామని చెప్పేశారు. ఆ లెక్కన 2026 సెకండాఫ్ సూర్య కెరీర్‌లో ది బెస్ట్ అవుతుంది. మరచిపోవద్దు ఈ సినమాలన్నీ ‘కంగువ’ లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్నవి/ వచ్చినవి.
















